మతాల మధ్య బీజేపీ చిచ్చు

ABN , First Publish Date - 2022-11-04T23:41:07+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చురేపుతూ మారణహోమం సృష్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. సీపీఎం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలోని ఐకేగార్డెన్స్‌లో జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు.

మతాల మధ్య బీజేపీ చిచ్చు
సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం

మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిదే విజయం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

హనుమకొండ క్రైం, నవంబరు 4: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చురేపుతూ మారణహోమం సృష్టిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. సీపీఎం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలోని ఐకేగార్డెన్స్‌లో జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీరభద్రం హాజరయ్యారు. ముందుగా సెంటర్‌లోని అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఎర్రజెండా ఆవిష్కరించిన తర్వాత కార్యక్రమంలో మాట్లాడారు.

మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాడని తమ సర్వేలో తేలిందని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా ఆయన సొంత నిర్ణయం కాదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టాలనే కుట్రతోనే కాంగ్రె్‌సకు, ఎమ్మెల్యే పదవికి బీజేపీ నేతలే బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బలమైన అభ్యర్థులకు గాలం వేస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ పార్టీ బొక్కబోర్లా పడే రోజులు దగ్గరలో ఉన్నాయని వీరభద్రం జోస్యం చెప్పారు. దేశంలో ప్రజాస్వాయ్యం బతకాలంటే బీజేపీని అన్ని ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ కుటిల రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఆర్థికంగా బలం గా ఉన్నవారిని ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని బీజేపీ చూ స్తోందని అన్నారు. కొందరు బీజేపీ నాయకులైతే దేశంలో మత ప్రచారం కూడా చేస్తున్నారని, రానున్నరోజుల్లో ఇది అన్నివర్గాల ప్రజలకు నష్టం కలిగిస్తుందని అన్నారు. రాష్ట్రంలో పోడుభూముల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్‌కు విన్నవిస్తామని వీరభద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ నాయకులు చక్రపాణి, వాసుదేవరెడ్డి, వెంకట్‌, వీరన్న, సంపత్‌, భానునాయక్‌, దీప, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-04T23:41:18+05:30 IST