YS Sharmila: వైఎస్ షర్మిల అరెస్ట్
ABN , First Publish Date - 2022-11-28T16:32:25+05:30 IST
వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila)ను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిల అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌టీపీ (YSRTP) కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

వరంగల్: వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila)ను అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి వద్ద షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిల అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌టీపీ (YSRTP) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకర్తలపై పోలీసులు లారీఛార్జ్ చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy)పై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మా పాదయాత్రకు అనుమతి ఉంది. బస్సును దగ్ధం చేసినవారిని అరెస్ట్ చేయకుండా.. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు’’ అని షర్మిల మండిపడ్డారు.
నర్సంపేట నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలట
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సుదర్శన్‌రెడ్డి ఆయన భార్య సైతం ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతూ డబ్బులు దండుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. నర్సంపేట ఎమ్మెల్యే పేరుకే పెద్ది సుదర్శన్‌రెడ్డి అని, మనిషిది చిన్న బుద్ధి అని అన్నారు. ఉద్యమకారుడిగా ఉండి నేడు తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు కబ్జాకోరయ్యాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అనుచరుల కన్నుపడితే భూమి మాయమవుతుందన్నారు. చివరికి లే ఔట్ల్‌లో గ్రీన్‌ల్యాండ్స్‌ను వదలడం లేదని పేర్కొన్నారు. ఆయనకు సంపాదన తప్ప మరో ధ్యాసలేదని, ఇలాంటి వారికి ఎందుకు ఓట్లు వేయాలని, కర్రుకాల్చి వాతపెట్టాలన్నారు.