Share News

ACB Court: చంద్రబాబుపై పిటివారెంట్‌.. విచారణ వాయిదా

ABN , First Publish Date - 2023-11-10T16:29:10+05:30 IST

Andhrapradesh: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ వేసిన పిటివారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.

ACB Court: చంద్రబాబుపై పిటివారెంట్‌..  విచారణ వాయిదా

విజయవాడ: ఫైబర్ నెట్ కేసులో (Fiber Net Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై(TDP Chief Chandrababu Naidu) సీఐడీ (CID) వేసిన పిటివారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) విచారణ వాయిదా పడింది. చంద్రబాబుపై సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. పిటివారెంట్‌పై విచారణ జరిపిన ఏసీబీ న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. కాగా.. ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. ఈనెల 30 వరకు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేస్ పిటివారెంట్‌పై ఎలాంటి అరెస్టులు చేయవద్దని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసులో ఆస్తులు అటాచ్‌‌మెంట్‌పై విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది.

Updated Date - 2023-11-10T16:29:11+05:30 IST