బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:06 AM
ఓటమి ఎరుగని రాజకీయ నేతగా 50ఏళ్ల పాటు పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఘనత డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్‌కు దక్కుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు.

అమలాపురం రూరల్, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఓటమి ఎరుగని రాజకీయ నేతగా 50ఏళ్ల పాటు పార్లమెంటేరియన్‌గా పనిచేసిన ఘనత డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్‌కు దక్కుతుందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, బలహీనవర్గాల ఆశాజ్యోతిగా ఆయన నిలిచిపోతారని కొనియాడారు. పేరూరులో శనివారం ఆకుమర్తి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు, సర్పంచ్ దాసరి అరుణ, మంథా ఫణికుమార్, దేవరపల్లి వీరేష్‌కుమార్, ఎంవీవీ సత్యనారాయణ, కుడుపూడి సత్యనారాయణ, జల్లి శ్రీనివాసరావు, దాసరి డేవిడ్ పాల్గొన్నారు. నడిపూడి డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్ కల్యాణ మండపం వద్ద జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఊటాల వెంకటేష్, నెల్లి వెంకటేశ్వరరావు, మోకా శ్రీనివాసరావు, బొక్కా నాని, రాయుడు ప్రసాద్, రావూరి రాంబాబు తదితరులు పాల్గొని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. డాక్టర్ బాబూజగ్జీవన్‌రామ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మోకాటి నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి, రాజమహేంద్రవరం సబ్‌రిజిస్ర్టార్ రాయి రాంబాబు, పంచాయతీరాజ్ డీఈ పీఎస్ రాజ్‌కుమార్, మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరై జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. జిల్లా విజిలెన్స్ అండ్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ మోనటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన మోకాటి నాగేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్‌గా నియమితులైన మడికి శ్రీరాములును సొసైటీ తరపున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అధికారి బాబ్జి, యార్లగడ్డ రవీంద్ర, పెద్దిరెడ్డి రాము, పొలమూరి ధర్మపాల్, కాప నాగభూషణం, చాట్ల సత్యనారాయణ, నూటుకుర్తి మూర్తి తదితరులు పాల్గొన్నారు. బండారులంక పంచాయతీ కార్యాలయం వద్ద శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్టీ చింతా శంకరమూర్తి, మాదిగ యువజన సంఘం ఆధ్వర్యంలో పలువురు నాయకులు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. సర్పంచ్ పెనుమాల సునీత, దండోరా నాయకులు ఉందుర్తి జీవరత్నం, ఈతకోట రాజేష్, జొన్నాడ నాగరాజు, తొత్తరమూడి మురుగులమ్మతో పాటు మాడామాధవి, బండి మణికంఠ, కడలి వెంకటేశ్వరరావు, కాశిన బాబి పాల్గొన్నారు.