సాధికారిక సభ్యుల నియామకాన్ని పూర్తిచేయండి
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:10 AM
కుటుంబ సాధికారిక సభ్యుల నియామకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు.

ముమ్మిడివరం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): కుటుంబ సాధికారిక సభ్యుల నియామకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అర్థాని శ్రీనివాసరావు అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన నియోజకవర్గ సమన్వయకమిటీ సమావేశంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు ముఖ్య అతిథిగా మాట్లాడారు. 30మంది పార్టీ సభ్యులకు ఒక సాధికారిక సభ్యున్ని నియమించాలని, ఈప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన సూచించారు. పార్టీ సభ్యత్వాల నమోదులో తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలను దాటి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 46వేల సభ్యత్వాలను పూర్తిచేసి సభ్యులకు సభ్యత్వ కార్డు అందజేశామన్నారు. పాస్టర్ ప్రవీణ్‌కుమార్ మరణాన్ని రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని, ఇటువంటి దుష్ప్రచారాలను నాయకులు తిప్పొ కొట్టాలన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి టెండర్లు పిలిచారని, దీంతో రాష్ట్రం అభివృద్ధి చెంతుందన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని, కేంద్ర సహకారంతో పవన్‌కల్యాణ్, చంద్రబాబునాయుడు రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. దీనికి ముందు బాబూజగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, నాగిడి నాగేశ్వరరావు, గొలకోటి దొరబాబు, తాడి నరసింహారావు, పొద్దోకు నారాయణరావు, దొమ్మేటి రమణకుమార్, టేకుమూడి లక్ష్మణరావు, వాడ్రేవు వీరబాబు, కాకర్లపూడి రాజేష్, ఆకాశం శ్రీనివాస్, దాట్ల బాబు, సాగి సూరిబాబురాజు, దూళిపూడి బాబి, మోపూరి వెంకటేశ్వరరావు, కట్టా త్రిమూర్తులు, చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, అడబాల సతీష్‌కుమార్, కడలి నాగు, కట్టా సత్తిబాబు, మెండి కమల, బొక్కా రుక్మిణి, వాసంశెట్టి అమ్మాజీ, ముమ్మిడివరపు వరలక్ష్మి, అత్తిలి ప్రసన్న, కుడుపూడి మల్లేశ్వరి, గోదశి గణేష్, జనిపల్లి సత్యనారాయణ, సరిపల్లి శ్రీనివాసరాజు, సానబోయిన సోమన్న, రెడ్డి శ్రీను, పాయసం చిన్నీ, కాకి మాణిక్యం, దాట్ల బాబుపాల్గొన్నారు.