Devineni Uma: సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబుపై దేవినేని ఉమ తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2023-07-15T19:34:50+05:30 IST

గోదావరి కృష్ణా, పెన్నా డెల్టాల్లో ఎక్కడైనా ఏ కాలువైనా బాగు చేశారా?. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో జరిగిన దోపిడీపై మేం విచారించాలా బుద్ధిలేని రాంబాబు?...

Devineni Uma: సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబుపై దేవినేని ఉమ తీవ్ర విమర్శలు

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి (YS JAGAN MOHAN REDDY), నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై (Ambati Rambabu) టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు.


"జాతీయప్రాజెక్టును గాలికివదిలేసి జగన్ రెడ్డి జాతిద్రోహానికి పాల్పడ్డాడు. జగన్ రెడ్డిని వెనకేసు కొస్తూ సంబరాలరాంబాబు మీడియాపై విషంకక్కాడు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోకి మీడియాను, ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించడంలేదో రాంబాబు సమాధానం చెప్పాలి. పోలవరంలో గైడ్ బండ్ ఎందుకు కుంగిందో, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంగతేమిటి సంబరాల రాంబాబు?. లైడార్ సర్వేపై మంత్రి ఎందుకు నోరుమెదపలేదు? సర్వే రిపోర్టుల్ని తొక్కిపెట్టి పోలవరం నిర్వాసితుల్ని ఏం చేయాలనుకుంటున్నారు?. పోలవరం కాపర్ డ్యామ్ భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారు?. గోదావరికి వరద ముంచుకొస్తున్న తరుణంలో నిర్వాసితుల్ని ఏం చేయబోతున్నారు?. 50 నెలల్లో ఇరిగేషన్ రంగంలో ఏంసాధించారు?. రాయలసీమలో ఏ ప్రాజెక్టులు నిర్మాణానికి ఎంత ఖర్చుపెట్టారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఎంత సొమ్ము వెచ్చించి ఎన్నిఎకరాలకు నీళ్లిచ్చారు?." ఉమ ప్రశ్నించారు.


గోదావరి కృష్ణా, పెన్నా డెల్టాల్లో ఎక్కడైనా ఏ కాలువైనా బాగు చేశారా?. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో జరిగిన దోపిడీపై మేం విచారించాలా బుద్ధిలేని రాంబాబు?. 26 ప్రాజెక్టుల నిర్మాణానికి 50 నెలల్లో ఎంతఖర్చు పెట్టారు. ఎన్ని పనులు జరిగాయి. ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారనే పూర్తివివరాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయగలవా రాంబాబు?. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో పనులు చేయకుండానే డబ్బుకాజేసి, ఆ సొమ్ముని వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గాల వారీగా రిజర్వ్ చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటివాళ్లకు, వారి సంస్థలకు ఎన్నివందలకోట్లు దోచిపెట్టారు?. రాయలసీమ కరువు నివారణ కింద, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో తీసుకొచ్చిన అప్పుల్లో రూ.733 కోట్లు ఆర్.ఈ.సీ చెల్లించిందని రాంబాబు చెబుతున్నాడు. పనులు చేయకుండా ప్రంట్ లోడింగ్ పేరుతో రూ. 706 కోట్లు ఏజెన్సీలకు చెల్లించామని రాంబాబు ఒప్పుకున్నాడు." అని టీడీపీ సీనియర్ నేత ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-07-15T19:34:59+05:30 IST