Share News

Vijayawada Durgamma: తొలిసారి శ్రీమహాచండీదేవి అలంకారంలో దుర్గమ్మ.. 3గంటల నుంచే దర్శనం

ABN , First Publish Date - 2023-10-19T09:38:26+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ మహా చండీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కలిపించారు. ఎప్పడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Vijayawada Durgamma: తొలిసారి శ్రీమహాచండీదేవి అలంకారంలో దుర్గమ్మ.. 3గంటల నుంచే దర్శనం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ మహా చండీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కలిపించారు. ఎప్పడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చండీదేవి అలంకారానికి ఎంతో ప్రసిధ్ది ఉందని వేదపండితులు చెబుతున్నారు. అమ్మవారు మహచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, విష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వదేవతలను ప్రార్ధించినట్లే. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి శత్రువులు మిత్రువులు మారడం... ఏ కోర్కెల కోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.

Updated Date - 2023-10-19T09:38:26+05:30 IST