ప్రజా సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:03 AM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

మంత్రి సంధ్యారాణి
సామాజిక పింఛన్ల పంపిణీ
సాలూరు, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణంలోని రామాకాలనీలో మంగళవారం ఆమె పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆర్టీసీ డిపోలో నూతన బస్సును తానే స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సూర్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కౌన్సిలర్లు హర్షవర్ధన్, లక్ష్మోజీ, నటరాజ్, అప్పయమ్మ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం: ప్రజల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోం దని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మంగళవారం జేకేపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ నగదును అందించారు. ఎంపీడీవో సాల్మన్‌రాజు, ఏఎంసీ చైర్‌పర్సన్ క డ్రక కళావతి, టీడీపీ మండల కన్వీనర పాడి సుదర్శన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కురుపాం రూరల్: మండలంలోని ఆవిరి, వలసబల్లేను గ్రామాల్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వ రి మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరించారు. పశువుల నీటి తొట్టెలను ప్రారంభించారు. టీడీపీ మండల కన్వీనర్ కలిశెట్టి కొండయ్య, ఏఎంసీ చైర్‌పర్సన్ కళావతి, పార్టీ నాయకులు కడాయి, సుదర్శనరావు, ఎంపీడీవో ఉమామహేశ్వరి పాల్గొన్నారు.
బొబ్బిలి: పట్టణంలోని నాలుగో వార్డులో ఎమ్మెల్యే బేబీనాయన మంగళవారం పింఛన్లు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి, ఆరో వార్డు కౌన్సిలరు గెంబలి శ్రీనివాసరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మరిశర్ల రామారావు, మాజీ కౌన్సిలర్ పసుమర్తి గౌరు తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి రూరల్: కొత్తపెంట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే బేబీనాయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఎంపీడీవో పి.రవికుమార్, అధికారులు పాల్గొన్నారు.
బాడంగి: ఆకులకట్ట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, బుడా చైర్మన్ తెంటు లక్ష్ముంనాయుడు మంగళ వారం సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు తెంటు రవి, వైస్ ఎంపీపీ భాస్కర రావు, పార్టీ నాయకుడు అప్పలనాయుడు, సర్పంచ్ సత్యనారాయణ పాల్గొన్నారు.