సాహిత్యం మానవీయ విలువలను ప్రతిబింబిస్తుంది
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:02 AM
సాహిత్యం మానవీయ విలువలను ప్రతిబింబిస్తుందని ఉదయ సాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రినిటీ డిగ్రీ కళాశాల సమావేశ మం దిరంలో ఉదయసాహితీ, జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పెద్దపల్లి కల్చరల్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): సాహిత్యం మానవీయ విలువలను ప్రతిబింబిస్తుందని ఉదయ సాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రినిటీ డిగ్రీ కళాశాల సమావేశ మం దిరంలో ఉదయసాహితీ, జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో కోల్‌బెల్ట్ సాహిత్యం గ్రామీణ జీవితానికి నిలువు టద్దంగా నిలిపితే, జానపద, ఉద్యమ సాహిత్యం జిల్లాలో పెద్ద ఎత్తున వచ్చిందన్నారు.
అల్లం రాజయ్య, కాల్వ మల్లయ్య, ఆడెపు లక్ష్మయ్య, బుడిగ శంకర్, వేల్పుల నారా యణ జిల్లాలో సాహితీవేత్తలు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న సాహితీవేత్తలు తమ కవితగానం చేశారు. అనంతరం వారికి వేదిక తరపున సర్టిఫికెట్ అందజేసి సన్మానించారు. జిల్లా రచయితల సంఘం కన్వీనర్ ఏలేశ్వరం వెంకటేశం, కోకన్వీనర్ బుర్ర తిరుపతి, బహుజన సాహితీ వేదిక నాయకులు బాలసాని కొము రయ్య, యువకవి తడిగొప్పల కుమారస్వామి, నూనె రాజేశం, అనాసి జ్యోతి, బొమ్మినేని రాజేశ్వరి, ఎం.రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.