Pension festival గ్రామాల్లో పింఛన్ల పండుగ
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:00 AM
Pension festival గ్రామాల్లో పింఛన్ల పంపిణీని మంగళవారం చేపట్టారు. ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు పింఛన్లను అందించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

గ్రామాల్లో పింఛన్ల పంపిణీని మంగళవారం చేపట్టారు. ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు పింఛన్లను అందించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
అర్హులకు సంక్షేమ పథకాలు: ఎంజీఆర్
పాతపట్నం/మెళియాపుట్టి, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. అంతరాబ, చీపురుపల్లి గ్రామాల్లో పింఛన్లను మంగళవారం అందజేశారు. బూరగాం, పెద్దమడి గ్రామాల్లో పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణానికి భూమిపూజ చేశారు. మెళియాపుట్టి జూని యర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు సలాన మోహనరావు, బైరిశింగి లక్ష్మీనారాయణ, నాయ కులు పైల బాబ్జీ, శివాల చిన్నయ్య, మడ్డు రామారావు, బాస్కర్ గౌడో, తహసీల్దార్ బి.పాపారావు, ఎంపీడీవో ప్రసాద్‌పండా, పశు సంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.
పేదల కళ్లలో ఆనందం: అశోక్
కవిటి, ఏప్రిల్1(ఆంధ్ర జ్యోతి): పేదల కళ్లల్లో ఆనందం రావాలంటే చంద్ర బాబు పాలనలోనే సాధ్యమని ఇచ్ఛా పురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బి.అశోక్ తెలి పారు. రామయ్య పుట్టుగలో ఇచ్ఛా పురం నియోజక వర్గంలో కొత్తగా మంజూరైన 240 పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్ర మంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
సీఎం మాట ఇస్తే నిలబెట్టుకుంటారు: శిరీష
కాశీబుగ్గ, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు మాట ఇస్తే నిలబెట్టుకుంటారని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మంగళ వారం జయ రామచంద్ర పురంలో కిడ్నీ బాధితురాలు దట్టి వర లక్ష్మికి పింఛన్ అంద జేశారు. కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జ బాబూ రావు, నేతలు లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, నవీన్ పాల్గొ న్నారు. 4వ వార్డు శాంతినగర్‌లో సుమారు 40 ఇళ్లకు పొజిషన్ సర్టిఫికేట్ లేక నీటి పైపులు మంజూరు కాలేదని ప్రజలు సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చిన నెలరోజుల్లో పరిష్కరించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. శాంతినగర్‌లో వార్డు ఇన్‌చార్జి రామకృష్ణ ఆధ్వర్యంలో 40 మందికి పొజిషన్ సర్టిఫికేట్‌లను అందించారు. కార్యక్ర మంలో బడ్డ నాగరాజు, విఠల్, డి.శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు భరోసా: శంకర్
అరసవల్లి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో పేదల కళ్లల్లో ఎంతో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేటలో పింఛన్లను మంగళ వారం పంపిణీచేశారు. ప్రతీ నెల 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంధవరపు సంతోష్, అంధవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం లక్ష్యం: ఎన్‌ఈఆర్
జి.సిగడాం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు(ఎన్‌ఈఆర్) తెలిపారు. మంగళవారం మండలంలోని దేవరవలసలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జక్కంపూడి దాసు, వెంకటరావు, కుమరాపు రవికుమార్, పైల విష్నుమూర్తి, బూరాడ వెంకటరమణ, వజ్జపర్తి రఘరాం పాల్గొన్నారు.
ఎచ్చెర్ల, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): అల్లినగరానికి చెందిన గొర్లె గణేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతుండడంతో మంజూరైన పింఛన్‌ను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలా ధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ సంపతి రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో అర్హులందరికీ కొత్త పింఛన్లు: బగ్గు
పోలాకి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం త్వరలో కొత్తపింఛన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించి అర్హులందరికీ అందిస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంగళవారం మబగాంలో పింఛన్లను పంపిణీ చేశారు. దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతోందని, అలాగే ఈకేవైసీ పూర్తయిన వెంటనే కొత్త రేషన్‌కార్డులతో పాటు పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ బగ్గు అర్చన, గ్రామపెద్దలు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.