ప్రప్రథమ అభ్యుదయ కవి యోగివేమన
ABN , First Publish Date - 2023-01-20T00:51:28+05:30 IST
తెలుగు సాహిత్యంలో ప్రప్రథమ అభ్యుదయ కవి ఎవరైనా ఉన్నారంటే అది యోగి వేమన అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు.

కలెక్టరేట్‌లో జరిగిన యోగి వేమన జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్సీ డొక్కా వరప్రసాద్, జేసీ తదితర అధికారులు
గుంటూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యంలో ప్రప్రథమ అభ్యుదయ కవి ఎవరైనా ఉన్నారంటే అది యోగి వేమన అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గురువారం ప్రజాకవి యోగి వేమన జయంతి సందర్భంగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి వేమన చిత్రపటానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ వరప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం పద్యరూపేణ ప్రాచుర్యం పొందడానికి మూలం వేమన అని చెప్పారు. జేసీ రాజకుమారి మాట్లాడు తూ వేమన పద్యాల ద్వారా అందరూ రాగయుక్తంగా పాడడం, సరళంగా రాయడం అనేది ఎంతో గొప్పన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో చంద్రశేఖర్ రావు, స్టెప్ సీఈవో వెంకట నారాయణ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు, డీఎస్‌వో పద్మశ్రీ, స్టెఫ్ మేనేజర్ రాధిక పాల్గొన్నారు.