Share News

Minister Narayana: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మంత్రి నారాయణ ప్రకటన

ABN , Publish Date - Apr 05 , 2025 | 02:41 PM

Minister Narayana: డ్వాక్రా గ్రూపులతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు చేయాలన్నా డేటా పర్ఫెక్ట్‌గా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు.

Minister Narayana: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మంత్రి నారాయణ ప్రకటన

అమరావతి: ఈ రోజు ఐదు వెబ్‌సైట్‌లను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు పారిశ్రామిక వేత్తలను చేస్తామని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) మంత్రి నారాయణను మెప్మా అధికారులు ఏపీ సచివాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. డేటా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని.. ఇన్ని సంవత్సరాలు అయినా డ్వాక్రా సంఘాలు, మెప్మా డేటాను పర్‌ఫెక్ట్‌గా ఉంచుకున్నారని మంత్రి నారాయణ తెలిపారు.


ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యాలు చేయాలన్నా డేటా పర్ఫెక్ట్‌గా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ విషయంలో తాను నిజంగా సంతోష పడుతున్నానని చెప్పారు. 2047కు ప్రతి ఒక్కరి ఇంట్లో వ్యాపారవేత్తలు ఉండాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. గతంలో ఇసుక కాంట్రాక్టులు డ్వాక్రా గ్రూపులకు ఇచ్చారని.. కొన్ని అనివార్య కారణాలవల్ల అది అమలు జరుగలేదని తెలిపారు. 80 వేల‌ సంఘాలకు రూ. 8 కోట్లు ఇవ్వాలని ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 26 జిల్లాలకు మీటింగ్‌లు పెట్టాలని అనుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Axis Power Deal: జగన్‌ బాటలోనే చంద్రబాబు

YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్‌

For More AP News and Telugu News

Updated Date - Apr 05 , 2025 | 02:47 PM