Assembly TDP MLA Suspension : ‘విపక్షం’పై వేటు
ABN , First Publish Date - 2023-03-16T03:12:06+05:30 IST
గవర్నర్‌ను వెయిట్ చేయించారన్న పయ్యావుల వ్యాఖ్యల అంశం బుధవారం అసెంబ్లీలో చినికి చినికి గాలివానలా మారింది.

12 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
పయ్యావుల, నిమ్మలపై సెషన్ ముగిసేదాకా.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపైనా..
పయ్యావుల ‘వ్యాఖ్యల’పై వివాదం.. ‘గవర్నర్‌ను వెయిట్ చేయించారు’ అనడంపై గుస్సా
ఎమ్మెల్యేల నుంచి స్పీకర్ దాకా మండిపాటు.. పయ్యావులతోపాటు పత్రికపై చర్యలకు డిమాండ్
రామోజీరావును సభకు పిలిపించాలన్న సభ్యులు.. ‘ప్రివిలేజ్’ విచారణ తర్వాత చర్యలు: స్పీకర్
పయ్యావుల మాట్లాడుతుండగా ఆటంకాలు.. పోడియంపైకి ఎక్కి టీడీపీ సభ్యుల నిరసన
‘గవర్నర్‌ను ముఖ్యమంత్రి వెయిట్ చేయించారు’ అంటూ టీడీపీ సభ్యుడు, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పేర్కొన్నట్లుగా వచ్చిన వార్తపై శాసనసభలో దుమారం చెలరేగింది. ‘పయ్యావుల అబద్ధం చెప్పారు. ఇందులో నిజాన్ని పరిశీలించకుండా ఆ పత్రిక ప్రచురించింది’ అంటూ అధికార పక్షం మండిపడింది. పనిలోపనిగా తమకు గిట్టని మీడియాపైనా సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు.
అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ను వెయిట్ చేయించారన్న పయ్యావుల వ్యాఖ్యల అంశం బుధవారం అసెంబ్లీలో చినికి చినికి గాలివానలా మారింది. 12 మంది టీడీపీ సభ్యులను ఒకేసారి సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామిలను, వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అంతలోనే.. పయ్యావుల కేశ వ్, నిమ్మల రామానాయుడు, శ్రీధర్‌రెడ్డిలను మాత్ర మే సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశామని.. మిగిలిన 10 మంది టీడీపీ సభ్యులను బుధవారం ఒక్కరోజుకే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. తమను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు పోడియంపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఈ దశలో టీడీపీ, వైసీపీ సభ్యులు, మం త్రుల మధ్య తీవ్ర పదజాలంతో వాగ్యుద్ధం చోటుచేసుకుంది. సభ జరగకుండా ఆటంకం కల్పిస్తున్నందుకు 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మం త్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టడంతో వారిని స్పీకర్ సస్పెండ్ చేశారు. అయినా టీడీపీ సభ్యులు నిరసన కొనసాగించడంతో మార్షల్స్ వచ్చి బలవంతంగా పంపేశారు.
ఏం జరిగింది..?
గవర్నర్ ప్రసంగానికి ఽధన్యవాద తీర్మానంపై చర్చ జరగాల్సి ఉండగా.. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు కోరారు. దానిని తిరస్కరించినట్లు చెప్పాకే టీ విరామం ప్రకటించానని స్పీకర్ అన్నారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. మంగళవారం గవర్నర్ చేసిన ప్రసంగాన్ని కొందరు సభ్యులు హేళన చేస్తూ మాట్లాడారని, వాటిని కొన్ని పత్రికలు ప్రచురించాయని చెబుతూ.. ‘సీఎం రాక కోసం గవర్నర్ వేచి ఉండాలా’ అనే ఉప శీర్షికతో ‘ఈనాడు’ పత్రికలో వచ్చిన వార్తను చదివి వినిపించారు. ‘‘ఈ ప్రభుత్వం గవర్నర్ ను స్పీకర్ చాంబర్లో కూర్చోబెట్టి సీఎం కోసం వేచి ఉండేలా చేసింది. అసలు గవర్నర్ పెద్దా? సీఎం పెద్దా? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తితో రాష్ట్రంలో అమలులోని దిశ చట్టంపై అబద్ధాలు చెప్పించారు’ అని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలో ఉంది. సీఎం కోసం గవర్నర్ వేచి ఉండేలా చేసినట్లు పయ్యావుల చెప్పడం తప్పని బుగ్గన అన్నారు. మంగళవారం ఉదయం 9.45కి సీఎం అసెంబ్లీకి వస్తే.. 9.53కి గవర్నర్ వచ్చారని, ఆయనకు సీఎం, స్పీకర్, మండలి చైర్మన్‌తోపాటు మంత్రులు, సభ్యులందరం స్వాగతం పలికామని చెప్పారు. గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన సూచనల ప్రకారమే ఆయన్ను స్పీకర్ చాంబర్‌కు తీసుకెళ్లామ ని.. గవర్నర్ అక్కడ వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చారని, గొంతు నొప్పిగా ఉందని వేడినీళ్లు తాగారని, ఆ తర్వాత సభకు వచ్చారని వివరించారు.
ఇదంతా తెలిసీ పయ్యావుల మీడియా ద్వారా ప్రజలకు అబద్ధాలు చేరవేశారని చెప్పారు. మీడియా సంస్థలు కూడా వెరిఫై చేసుకోకుండా అవే అబద్ధాలను ప్రచా రం చేస్తూ.. రాజ్యాంగ సంస్థలు, వ్యక్తులను అవహేళన చేయ డం, అగౌరవపరచడం ప్రభుత్వానికి, సభాహక్కులకు భంగకరమన్నారు. ఈ అంశాన్ని సీరియ్‌సగా తీసుకుని సభా హక్కు ల సంఘానికి నివేదించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన తీరుకు తాను కూ డా ప్రత్యక్ష సాక్షినని, దీనిపై నోట్ ప్రిపేర్ చేసి పెట్టాలని స్పీక ర్ చెప్పారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చినట్లుగా పయ్యావుల మాట్లాడినా.. అది నిజమో.. కాదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఆ పత్రికకు ఉందని, ఆ బాధ్యతను విస్మరించి న ‘ఈనాడు’ పేరును కూడా సభా హక్కుల నోటీసులో చేర్చాలని సూచించారు. దీనిపై తన వాదన వినరా అని పయ్యావు ల ప్రశ్నించారు. ‘ఏదైనా చెప్పాలనుకుంటే ప్రివిలేజ్ కమిటీ ముందు చెప్పుకోండి’ అని స్పీకర్ బదులిచ్చారు. పయ్యావుల స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తన వాదనలు వినిపించసాగా రు. ఆయన వెంట మిగిలిన టీడీపీ సభ్యులంతా వెళ్లారు. వారిని తమ్మినేని పట్టించుకోకపోవడంతో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. స్పీకర్ ఏకపక్ష వైఖరి అంటూ నినాదాలు చేశా రు. ఈ దశలోనే.. దమ్ముంటే తనకు మైకు ఇచ్చి.. మాట్లాడే అవకాశమివ్వాలని పయ్యావుల అనడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి భాష అభ్యంతరకరమన్నారు. వెళ్లి సీట్లలో కూర్చోవాలని ఆదేశించారు. టీడీపీ సభ్యులు వెనక్కి వచ్చి సీట్లలో కూర్చున్నాక పయ్యావులకు మైకు ఇచ్చారు.
మంత్రుల దాడి..
పయ్యావుల మాట్లాడుతూ.. గవర్నర్‌ను నేరుగా సభకు తీసుకురాకుండా స్పీకర్ చాంబర్లో వేచి ఉండేలా చేశారనే తా ను మాట్లాడానని చెప్పారు. ఉదయం సభ 5 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైందని చెప్పానన్నారు. దిశ బిల్లును కేంద్రం ఆమోదించలేదని గవర్నర్‌తో ఎందుకు చెప్పించలేదని నిలదీశారు. ఈ సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర మంత్రులు పదే పదే అడ్డుకున్నారు. ఈ అంశంపై 40 నిమిషా లు చర్చ జరిగినప్పుడు.. తనకు 4 నిమిషాలైనా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా అని పయ్యావుల అన్నారు. తర్వాత ఆయన వ్యాఖ్యలను మంత్రులు బుగ్గన, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జున, జోగి రమేశ్, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, బొత్స, మాజీ మంత్రి కన్నబాబు తదితరులు ఖండించారు. ‘ఈనాడు’ పత్రికాధినేత రామోజీరావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆయనను అసెంబ్లీకి పిలిపించి, శిక్షించాలని డిమాండ్ చేశారు. బుగ్గన మాట్లాడుతూ.. పయ్యావులకు దమ్ము, ధైర్యం ఉంటే తాను అనని మాటలను ప్రచురించిన ఈనాడుపై పరువునష్టం దావా వేయాలన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఏదో ఒక రూపంలో మీడియా వక్రీకరణపై చర్చ పెట్టాలని కన్నబాబు కోరారు. ఇలాగే వదిలేస్తే మీడియా సంస్థలు అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రవర్తిస్తాయని చెప్పారు. మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. ఎల్లో మీడియాపై చర్చ జరగాలన్నారు. పయ్యావులపైన, ఈనాడు అధినేత రామోజీరావును సభకు పిలిపించి చర్యలు తీసుకోవాలని మంత్రి వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. స్పీకర్ మాట్లాడుతూ.. ప్రివిలేజ్ కమిటీ విచారించిన తర్వాత.. ‘ఈనాడు’ వార్తపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పారు.
ప్రతిపక్షం సంప్రదాయాలను దిగజారుస్తోంది: మంత్రి వేణు
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ప్రవర్తించిన తీరు సభాసంప్రదాయాలను దిగజార్చేలా ఉందని మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రసంగంపై ఒక పత్రికలో వచ్చిన వార్తను పీఏసీ చైర్మన్ కేశవ్ ఆమోదించకుండా, ఖండించకుండా.. అనవసర విమర్శలు చేశారు. సభా సమయాన్ని వృథా చేశారు. పేదలకు మా ప్రభు త్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, ప్రతిపక్షం పెత్తందార్లకు కొమ్ముకాసేలా వ్యహరిస్తోంది’’ అన్నారు.