Janasena Leader: ‘బ్రో’ సినిమా హిట్టా, ప్లాపా ప్రజలకు అవసరం.. మంత్రికి ఏం సంబంధం?
ABN , First Publish Date - 2023-08-03T12:57:02+05:30 IST
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan Kalyan) మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలపై జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు (Janasena Leader Gade Venkateshwar Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంబటి రాంబాబు ఒక్కసారైనా తన శాఖకి సంబంధించి ప్రెస్స్ మీట్ పెట్టారా అని ప్రశ్నించారు. సత్తెనపల్లి గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో స్క్రిప్ట్ పేపర్ చదివి తిరిగి గెస్ట్ హౌస్‌కు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. బ్రో సినిమా గురించి మంత్రికి ఏం సంబంధమని ప్రశ్నించారు. బ్రో సినిమా హిట్ట అయ్యిందా ఫ్లాప్ అయ్యిందా అనే విషయం రాష్ట్ర ప్రజలకు అవసరం లేదన్నారు. బ్రో సినిమా గురించి ఒక మంత్రి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాలలో కొత్త మార్పుని తేవడానికి పవన్ కళ్యాణ్ జనసెన పార్టీని స్థాపించారని తెలిపారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను పక్కదారి పట్టించడానికి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో వృద్ధురాలి ఘటన జరిగిన తరువాత నుంచి అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మొదలు పెట్టారని గాదె వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు.