Manipur: మణిపూర్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌: బొత్స

ABN , First Publish Date - 2023-05-07T19:18:05+05:30 IST

మణిపూర్‌ (Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఆంధ్రా విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని..

Manipur: మణిపూర్‌లో చిక్కుకున్న విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌: బొత్స

విజయనగరం: మణిపూర్‌ (Manipur) రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఆంధ్రా విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సూచించారు. మన రాష్ట్రానికి చెందిన ఎన్‌ఐటీ, ఐఐటీ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు తమతో టచ్‌లో ఉన్నారని, 150 మందిని విమానంలో ఇక్కడికి తీసుకొచ్చేందుకు పౌర విమానయానశాఖమంత్రితో మాట్లాడుతున్నామని తెలిపారు. తొలుత హెల్ప్‌లైన్‌ నెంబరు ఏర్పాటు చేశామని, ఏపీ భవన్‌ అధికారిని ఎప్పటికప్పుడు పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మరోవైపు మణిపూర్‌లో చదువుతున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం (AP Government) చర్యలు చేపట్టింది. అక్కడి ఏపీ విద్యార్థులను స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాదాపు 150 మంది ఏపీ విద్యార్థులు మణిపూర్‌లో చదువుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారిని ఆంధ్రాకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రితో ఏపీ అధికారులు మాట్టాడారు. ఏపీ విద్యార్థులను తరలించేందుకు పౌర విమానయాన శాఖ అంగీకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక విమానం ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారం త్వరలోనే ఇస్తామని అధికారులు తెలియజేశారు. ఇప్పటికే ఈ విషయంపై పౌర విమానయాన శాఖ మంత్రికి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ ( AP Bhavan Resident Commissioner Adityanath Das) లేఖ రాశారు. అలాగే ఏపీ విద్యార్థులకు తగిన సాయం చేయాలని మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు.

Updated Date - 2023-05-07T19:18:05+05:30 IST