జగన్‌ దిగిపోవాలి.. జనం బాగుపడాలి

ABN , First Publish Date - 2023-05-12T22:53:05+05:30 IST

జగన్‌ దిగిపోవాలి.. జనం బాగుండాలి అని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

జగన్‌ దిగిపోవాలి.. జనం బాగుపడాలి
దళితులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కస్తూరి విశ్వనాథనాయుడు

రాయచోటిటౌన్‌, మే 12: జగన్‌ దిగిపోవాలి.. జనం బాగుండాలి అని రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 25, 26 వార్డుల్లో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ అంటూ చెప్పిన మాటల మాయలో పడి మోసపోయామని ప్రజలు వాపోతున్నారని, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ సైకోని తరిమికొడదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.తెలుగుదేశం పార్టీపైనే యువత భవిష్యత్తు ఆధార పడి ఉంటుందన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం యువత లక్ష్య మని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోన మల ఖాదర్‌వలి, మాజీ కౌన్సిలర్‌ మహబూబ్‌బాషా, కొట్టే చలపతి, రాయచోటి తెలుగు యువత అధ్యక్షుడు ఇనాముల్లా, ఇలియాజ్‌, జగదీష్‌, అమావాస్య రెడ్డెయ్య, సర్దార్‌ఖాన్‌, శేషి, జాబీర్‌, అప్జల్‌, శ్రీనివాసులు, శివా రెడ్డి, మన్సూర్‌, రామక్రిష్ణగౌడ్‌, వెంకట్రామిరెడ్డి, సుబాన్‌బాషా, గంగాధర్‌, దుర్గ, రెడ్డిబాషా, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు.

సిద్దవటం: మండలంలోని మాచుపల్లె గ్రామ పంచాయతీలో టీడీపీ నాయ కులు దశరఽథరామానాయుడు, రాజంపేట పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు పుత్తా రామచంద్రయ్య, మోహన్‌రెడ్డి ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించారు. మాచుపల్లె యూనిట్‌ ఇన్‌చార్జి పిచ్చిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌రెడ్డి, మాచుపల్లె నేతలు రమణారెడ్డి, మూలపల్లెమాజీ సర్పంచ్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక

చిట్వేలి: ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తిమ్మయ్యగారిపల్లె లో వంద దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాఽథనాయుడు టీడీపీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నాలుగేళ్లలో రాష్ట్రం అధోగతి పాలైం దని, అందుకే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం వైపు మొగ్గుచూపుతున్నార న్నారు నాయకులు రాజానాయుడు, అనితా దీప్తి, బాలకృష్ణ యాదవ్‌, పెరుగు కృష్ణయ్యనాయుడు, పెంచలయ్య, వెంకటేష్‌ రాజు, షబ్బీర్‌, నాగ య్య, కరీంబాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-12T22:53:05+05:30 IST

News Hub