టీడీపీ ఎమ్మెల్సీ నామినేషన్‌కు కడప నేతలు

ABN , First Publish Date - 2023-02-22T23:05:33+05:30 IST

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బుధవారం అనంతపురంలో నామినేషన్‌ దాఖలు చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ నామినేషన్‌కు కడప నేతలు
రాంగోపాల్‌రెడ్డికి శాలువా కప్పి సత్కరిస్తున్న టీడీపీ నేతలు

కడప (ఎర్రముక్కపల్లె), ఫిబ్రవరి 22: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బుధవారం అనంతపురంలో నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లెల లింగారెడ్డి, వికాస్‌ హరిక్రిష్ణ, కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నేతలు బాలదాసు, జలతోటి జయకుమార్‌, నాసర్‌ ఆలీ, రెడ్డయ్యయాదవ్‌, సయ్యద్‌ రెహ్మాన్‌, వరద కిరణ్‌కుమార్‌ యాదవ్‌, మీడియా కోఆర్డినేటర్‌ జనార్ధన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T23:05:35+05:30 IST