తెలుగు సాహిత్య వెలుగు రేఖ.. వేమన
ABN , First Publish Date - 2023-01-19T23:26:20+05:30 IST
జీవిత సత్యాలను, మానవతా విలువలను అందరికీ అర్థమయ్యేలా సరళంగా, స్పష్టంగా పద్యాలు రచించిన వేమన తెలుగు సాహిత్యానికి వెలుగు రేఖ అని డీఈవో రాఘవరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని డీఈఓ కార్యాలయంలో యోగివేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు.

డీఈవో రాఘవరెడ్డి
రాయచోటిటౌన్, జనవరి 19: జీవిత సత్యాలను, మానవతా విలువలను అందరికీ అర్థమయ్యేలా సరళంగా, స్పష్టంగా పద్యాలు రచించిన వేమన తెలుగు సాహిత్యానికి వెలుగు రేఖ అని డీఈవో రాఘవరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని డీఈఓ కార్యాలయంలో యోగివేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఆయన మాట్లాడుతూ యోగివేమన జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం జనవరి 19న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వలన ఆ మహాకవికి సముచిత గౌరవం లభించిందన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ కొండూరు శ్రీనివాసరాజు, సంబేపల్లె హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్‌రావు, నరసింహులు, ఎంఈవో రమాదేవి, డీఈవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిద్దవటంలో: మండలంలోని భాకరాపేట 11వ పోలీసు బెటాలియన్‌లో గురువారం యోగివేమన జయంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంటు ఎన్.శ్రీనివాసరావు హాజరై వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంటు కె.ప్రభుకుమార్, డీఎస్పీ, అసిస్టెంట్ కమాండెంటు కె.వెంకటరెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, ఏఆర్‌ఎ్‌సఐలు పాల్గొన్నారు.
చిట్వేలిలో: తెలుగు సాహితీ రంగానికి వేమన పద్యాలు గొప్ప సంపదని చిట్వేలి ఉపసర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం యోగివేమన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉపసర్పంచ్ వేమన విగ్రహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో వెంకటేష్, నరసింహ, హజరత్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, బాబు పాల్గొన్నారు.
సంబేపల్లెలో: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రజాకవి వేమన జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు నరసింహారెడ్డి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు పద్యపోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి తెలుగు పండితులు వెంకట్రామరాజు, సరస్వతి నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
గాలివీడులో: వేమనను మించిన కవులు చరిత్రలో లేరని, నీతి నేర్పిన మహోన్నత వ్యక్తి ఆయన పద్యాలు ఎప్పటికీ సజీవంగా చరిత్రలో నిలిచిపోతాయని ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి వెంకటశివారెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని బస్టాండు వద్ద యోగివేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీ రెడ్డి సంఘం ప్రతినిధులు, గౌరవ సలహాదారులు శివగంగిరెడ్డి, ఏపీ రెడ్డిసంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కార్యవర్గ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.