Nara Lokesh: జగనే తొక్కిసలాట స్కెచ్.. ప్రతిపక్షం అంటే వణుకు..
ABN , First Publish Date - 2023-01-05T20:50:11+05:30 IST
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై (JAGAN) ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై (JAGAN) ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. జగన్కు.. ఎన్నుకున్న ప్రజలంటే భయమని, ప్రశ్నించే ప్రతిపక్షం అంటే వణుకు అని నారా లోకేష్ అన్నారు. చంద్రబాబు (Chandrababu) సభలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయని, టీడీపీ ప్రభంజనాన్ని చూసి సైకో ఓర్వలేకపోయాడని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికత్తి గాటు, బాబాయ్ గుండెపోటు డ్రామాల అనుభవంతో తొక్కిసలాట స్కెచ్ వేశాడని నారా లోకేష్ ఆరోపించారు. వెనువెంటనే చీకటి జీవో నెంబర్ 1 తెచ్చాడని, ఏపీలో దుస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీలో నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని లోకేష్ జోస్యం చెప్పారు.