TTD: ఆరు వీఐపీ బ్రేక్‌ టికెట్లు రూ.30 వేలు

ABN , First Publish Date - 2023-01-23T21:50:20+05:30 IST

శ్రీవారి వీఐపీ (VIP) బ్రేక్‌ దర్శన టికెట్లను అధిక ధరకు విక్రయించిన నేపథ్యంలో తిరుమల (Tirumala) టూటౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

TTD: ఆరు వీఐపీ బ్రేక్‌ టికెట్లు రూ.30 వేలు

తిరుమల: శ్రీవారి వీఐపీ (VIP) బ్రేక్‌ దర్శన టికెట్లను అధిక ధరకు విక్రయించిన నేపథ్యంలో తిరుమల (Tirumala) టూటౌన్‌ పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యింది. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ప్రమోద్‌కుమార్‌ శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చాడు. రూ.3 వేల విలువ కలిగిన ఆరు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను శ్రీరామ్‌ అలియాస్‌ బాబీ అనే దళారీ రూ.30 వేలు తీసుకుని విక్రయించాడు. మోసపోయామని గుర్తించిన భక్తులు విజిలెన్స్‌ వింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ (Vigilance) నివేదిక ఆధారంగా తిరుమల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అంగప్రదక్షిణ టోకెన్ల కోటా నేడు విడుదల

తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను టీటీడీ మంగళవారం విడుదల చేయనుంది. ‘Tirupatibalaji.AP.Gov.in’ వెబ్‌సైట్‌ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేసేందుకు టీటీడీ ప్రణాళిక రూపొందించుకుంది. కాగా, శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేశారు.

Updated Date - 2023-01-23T21:50:21+05:30 IST