Achchennaidu: లోకేష్ పాదయాత్రతో వైసీపీ నేతలు గుండెల్లో రైళ్లు: అచ్చెన్న
ABN , First Publish Date - 2023-01-28T20:59:37+05:30 IST
నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra) షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి వైసీపీ నేతల(ycp leaders) గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achchennaidu) అన్నారు.
శ్రీకాకుళం: నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra) షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి వైసీపీ నేతల(ycp leaders) గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achchennaidu) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్న వైసీపీ నేతలు లోకేష్ పాదయాత్రను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఒకవైపు సైకో జగన్ మరోవైపు ఉన్నారన్నారు.ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్న సీఎం దేశ చరిత్రలో లేరన్నారు.వైసీపీ పాలనలో అన్ని వర్గాలు దగా పడ్డాయని మండిపడ్డారు.బీసీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.లోకేష్ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని చెప్పారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు(CHANDRABABU) సీఎం అవ్వటం ఖాయమన్నారు.లోకేష్ పాదయాత్రలో పోలీసులు ఉత్సవ విగ్రహాలుగా మారారని ధ్వజమెత్తారు.ట్రాఫిక్‌ను క్లియర్ చేయకుండా చోద్యం చూస్తున్నారన్నారు.పోలీసులు వ్యవహరించిన తీరు చాలా బాధ అనిపించిందన్నారు. మా ప్రాంత వాడుక భాషలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు.మళ్లీ చెబుతున్నాను...వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులను విడిచిపెట్టేది లేదన్నారు. పోలీసులను బూతులు తిట్టిన మంత్రులపై ఎందుకు కేసు పెట్టరని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.