Kuna Ravikumar: ‘టెర్రరిస్ట్ కంటే జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాదే ప్రమాదకరం’

ABN , First Publish Date - 2023-03-07T14:22:39+05:30 IST

ఉత్తరాంధ్ర గ్యాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నతమైన వ్యక్తిని టీడీపీ నిలబెట్టిందని ఆ పార్టీ నేత కూన రవికుమార్ తెలిపారు.

Kuna Ravikumar: ‘టెర్రరిస్ట్ కంటే జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాదే ప్రమాదకరం’

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర గ్యాడ్యూట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్నతమైన వ్యక్తిని టీడీపీ (TDP) నిలబెట్టిందని ఆ పార్టీ నేత కూన రవికుమార్ (Kuna Ravikumar) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ (Jagan Government) అరాచకాలను ప్రశ్నించడం కోసం.. డాక్టర్ వేపాడ చిరంజీవిని పోటీలో పెట్టామన్నారు. మర్డర్‌లు, నేరాలు చేసే వారు పెద్దల సభకు వెళ్తున్నారని... వైసీపీ (YCP) హయాంలో పెద్దల సభ పరువుతీస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు (Chandrababu Naidu) ఏనాడు ఉద్యోగ, ఉపాధ్యాయులను అణిచివేయలేదన్నారు. అరచకాలు సాగిస్తున్న జగన్ చెంప చెల్లుమనాలంటే ఉద్యోగ ఉపాద్యాయులు టీడీపీ (TDP) అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరారు. జగన్ (AP CM) అహంకారాన్ని అణచివేయడానికి... అంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్వేషం, విధ్వంసం ఇదే జగన్ పాలన అని అన్నారు. వైసీపీ రహిత ఏపీని తయారుచేయాలంటే గ్రాడ్యుయేట్, ఉపాద్యాయులు, ఉద్యోగులు విజ్ఞతతో ఆలోచించాలని అన్నారు. ఓట్లను చీల్చవద్దని.. ఓట్లు చీలడం ద్వారా లక్ష్యం నెరవేరదని తెలిపారు. వ్యక్తులు కాదు ముఖ్యం.. జగన్ అహంకారాన్ని దెబ్బకొట్టడమే ముఖ్యమన్నారు. ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్.. ఇప్పుడు మోదీ కాళ్ల ముందు ఆంధ్రుల ఆత్మగౌరవంను తాకట్టుపెట్టారని టీడీపీ నేత విరుచుకుపడ్డారు.

మెగా డీఏస్సీ అన్నారని... పాఠశాలలను మూసేస్తున్నారని మండిపడ్డారు. సీపీఏస్ రద్దంటూ.. మాట మార్చారన్నారు. 15 వేలు జీతం ఇచ్చి సచివాలయ సిబ్బందిని వెట్టి చాకిరీ కార్మికులుగా చేశారని వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం సొంత బాబాయినే మర్డర్ చేయించారని దుయ్యబట్టారు. నాడు బాబాయ్ మర్డర్‌పై సీబీఐ వేయాలని జగన్ అన్నారని... జగన్ అబద్దాల నాడు ప్రజలు నమ్మారని అన్నారు. సీబీఐ నిగ్గు తేల్చిందని.. మర్డర్ మూలాలు అన్ని తమ ఇంటి చుట్టే ఉన్నాయని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రాజకీయ అనుభవం అంత లేదు సీదిరి అప్పలరాజు వయస్సు అని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఫీజ్ రియంబర్స్మేంట్, హాస్టల్ పీజులతో చదివిన వ్యక్తి మంత్రి సీదిరి అని తెలిపారు. అప్పల రాజు ఇప్పుడు కప్పలా బెకబెకమంటున్నారని మండిపడ్డారు. సీదిరి అప్పల రాజు తండ్రి గతంలో టీడీపీ సర్పంచ్ అని గుర్తుచేశారు. తిన్నఇంటి వాసాలు లెక్కబేట్టే రకం.. మంత్రి సీదిరిది అని అన్నారు. టెర్రరిస్ట్ కంటే జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాదే ప్రమాదకరమని టీడీపీ నేత కూన రవికుమార్ విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-03-07T14:22:39+05:30 IST