BRS: విశాఖలో బీఆర్ఎస్ నేతల సమావేశం.. పలువురు పార్టీలో చేరిక
ABN , First Publish Date - 2023-04-08T21:33:31+05:30 IST
గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు వదులుకుందని బీఆర్ఎస్ (BRS) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota chandrasekhar) ప్రశ్నించారు.
విశాఖపట్నం: గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు వదులుకుందని బీఆర్ఎస్ (BRS) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota chandrasekhar) ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రతిపక్షం టీడీపీ (TDP) రెండు కూడా మోదీ (PM Modi)ని ప్రశ్నించరని మండిపడ్డారు. విశాఖ చిల్డ్రన్ థియేటర్లో బీఆర్ఎస్ నేతలు సమావేశయయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి కొంతమంది బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే కుట్రల్నిబీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. మోదీ నియంతృత్వ ధోరణితో దేశం అధోగతి పాలు అవుతుందన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే శక్తి జగన్ (CM Jagan)కు లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యమ్న్యాయ రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్ ఎదుగుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర వహిస్తోందన్నారు. దేశంలో బీజేపీ (BJP)కి ప్రత్యామ్న్యాయ శక్తిగా బీఆర్ఎస్ ఎదుగుతుందన్నారు.