Somu Veerraju: ఏపీ మూడు రాజధానులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-22T11:37:19+05:30 IST

విశాఖ (Visakha): ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) కీలక వ్యాఖ్యలు చేశారు.

Somu Veerraju: ఏపీ మూడు రాజధానులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

విశాఖ (Visakha): ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఒకే రాజధానికి కట్టుబడి వున్నామని.. అది అమరావతేనని స్పష్టం చేశారు. రాజధాని కోసం వేల కోట్లు నిధులు కేంద్రం ఇచ్చిందని, డబ్బు ఖర్చు పెట్టకుండా ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజధాని లేకుండా సీఎం జగన్ (CM Jagan) కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వారిని ప్రశ్నించకుండా.. అమరావతికే కట్టుబడి ఉన్నామన్న తమను ఎందుకు ప్రశ్నిస్తారని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి జగన్ ఆరేళ్లు రోడ్డు మీద నడిచారని, ఇప్పుడు ప్రతిపక్షాలను రోడ్డు ఎక్కనివ్వకుండా జీవో ఇచ్చారని సోము వీర్రాజు మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రం నష్టపోయిందని.. మేము అభివృద్ధి చేస్తుంటే ఇతర పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయన్నారు. ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో పెడింగ్‌లో పెట్టిన అంశాలను భీమవరం సభలో తీర్మానం చేస్తామన్నారు. మేము చేస్తున్న అభివృద్ధి చెపుతున్నామని... ఇతర రాజకీయపార్టీలు కేవలం హడావిడి చేస్తున్నాయని సోము వీర్రాజు విమర్శించారు.

Updated Date - 2023-01-22T11:37:24+05:30 IST

News Hub