Visakha: చెత్త పన్ను కడితేనే అమ్మ ఒడి డబ్బులు...

ABN , First Publish Date - 2023-06-27T14:43:57+05:30 IST

విశాఖ: పెందర్తిలో గ్రామ వాలంటీర్ల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. జోన్ 8 పరిధిలో చెత్త పన్ను కడితేనే అమ్మ ఒడి అకౌంట్‌లో డబ్బులు పడతాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో గ్రామ వాలంటీరు వాయిస్ మెసేజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Visakha: చెత్త పన్ను కడితేనే అమ్మ ఒడి డబ్బులు...

విశాఖ: పెందుర్తిలో గ్రామ వాలంటీర్ల (Village Volunteers) బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. జోన్ 8 (Zone 8) పరిధిలో చెత్త పన్ను (Garbage Tax) కడితేనే అమ్మ ఒడి అకౌంట్‌లో డబ్బులు పడతాయంటూ వాట్సాప్ గ్రూపుల్లో (Whats App Group) గ్రామ వాలంటీరు వాయిస్ మెసేజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. చెత్తపన్ను కట్టనివారు ఎవరైనా ఉంటే వెంటనే కనీసం ఐదు నెలల డబ్బులు కట్టాలని వాయిస్ మెసేజ్‌లు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పన్ను కట్టనివారికి అమ్మఒడి పథకం అమలు చేయవద్దంటూ అధికారులు తమను ఆదేశించారని వాలంటీర్లు తెలిపారు. పన్ను చెల్లించలేని పేదల నుంచి ముక్కు పిండి వసూలు చేయాలనే లక్ష్యంతో అమ్మఒడి పథకానికి లింకు పెట్టడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-27T14:43:57+05:30 IST