GMail: ఇలా చేస్తున్నారా? అయితే మీ జీమెయిల్ అకౌంట్‌ని పక్కా తొలగిస్తారు
ABN , First Publish Date - 2023-12-01T12:25:51+05:30 IST
జీమెయిల్(GMail) అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. మనలో కొంత మంది చాలా రోజులుగా జీమెయిల్ అకౌంట్‌ని ఉపయోగించుకోరు. అకౌంట్ వాడని వారిని హెచ్చరించింది జీమెయిల్ యాజమాన్యం.
ఢిల్లీ: జీమెయిల్(GMail) అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్. మనలో కొంత మంది చాలా రోజులుగా జీమెయిల్ అకౌంట్‌ని ఉపయోగించుకోరు. అకౌంట్ వాడని వారిని హెచ్చరించింది జీమెయిల్ యాజమాన్యం. ఎక్కువ కాలం వాడకుండా ఉన్న ఇన్ యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను డిసెంబర్ 1నుంచి తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. అకౌంట్ తొలగిస్తున్నట్లు ఫోన్లకు మెసేజ్ వస్తుందని తెలిపింది. అంటే ఇప్పటివరకు యాక్టివ్ గా లేని అకౌంట్లను తొలగిస్తున్నారన్నమాట. గూగుల్ ఇటీవల జీమెయిల్ ప్లాట్‌ఫాంలో అప్‌డేట్స్ తీసుకువచ్చింది.
ఇందులో భాగంగానే అకౌంట్స్ డిలేట్ అప్ డేట్ తీసుకువచ్చిందని సంస్థ అధికారులు తెలిపారు. అయితే గడిచిన రెండేళ్లుగా అకౌంట్ ను ఉపయోగించిన వారి ఖాతాలనే డిలిట్ చేయనున్నట్లు ప్రకటించారు. డిలిటేషన్ ప్రక్రియ ఇవాళ ప్రారంభం కానుంది. కాబట్టి.. మీ జీమెయిల్ అకౌంట్లు ఇన్ యాక్టివ్ లో ఉంటే వెంటనే యాక్టివ్ చేసుకోండి. మీ అకౌంట్ చాలా కాలంగా ఇన్ యాక్టివ్ గా ఉంటే గూగుల్ అకౌంట్ యాక్టివేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లను పంపుతుంది. అయితే Google డిస్క్, డాక్స్, Gmail తదితర సేవలు నిరంతరాయంగా పొందేందుకు, జీమెయిల్ అకౌంట్ ని యాక్టివ్ గా ఉంచుకునేందుకు ఈ 3 ట్రిక్స్ అనుసరించండి...
1.కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారైనా జీమెయిల్ అకౌంట్ సైన్ ఇన్ చేయండి
2.ఈ మెయిల్, బ్రౌజ్ చేయడం, గూగుల్ లో సర్చ్ చేయడం, యూట్యూబ్ వీడియోలు చూడటం వంటివి చేస్తుంటే అకౌంట్ డిలిటేషన్ నుంచి తప్పించుకోవచ్చు
3. గూగుల్ అకౌంట్ కి లింక్ అయిన థర్డ్ పార్టీ యాప్‌లు, పబ్లికేషన్ ప్రొఫైల్ లు అకౌంట్ యాక్టివ్‌గా ఉండటానికి ఉపయోగపడతాయి.
ఎందుకు డిలీట్ చేస్తుందంటే..
రెండు సంవత్సరాలపాటు అకౌంట్ వాడకపోతే.. దాన్ని డిలీట్ చేసే హక్కు గూగుల్ కి ఉంటుంది. ఇన్‌యాక్టివ్ Google ఖాతా దాని కార్యాచరణ, డేటాను తొలగించే హక్కు Googleకి ఉంది. ఈ విధానం మీ వ్యక్తిగత Google అకౌంట్ కి వర్తిస్తుంది.ఆఫీస్, పాఠశాల లేదా ఇతర సంస్థల కోసం క్రియేట్ చేసిన గూగుల్ అకౌంట్‌కి ఈ విధానం వర్తించదు.