Guidance: ఈ ఐదు టెక్నిక్‌లు పాటిస్తే Tenth Class సక్సెస్‌

ABN , First Publish Date - 2023-01-05T14:21:31+05:30 IST

భవిష్యత్తుకు బాటలు వేసే బోర్డు పరీక్ష (Board Exam)ల్లో మొదటిది టెన్త్‌ ఎగ్జామ్‌ (Tenth Exam). అన్ని పరీక్షల మాదిరిగానే ఇదీ ఒకటి. అయితే ఈ పరీక్ష కెరీర్‌ను నిర్దేశిస్తుంది, అందుకు అవకాశాలను మెరుగుపరుస్తుంది.

Guidance: ఈ ఐదు టెక్నిక్‌లు పాటిస్తే Tenth Class సక్సెస్‌
ఇలా ప్రిపరేషన్‌ అయితే సక్సెస్ మీదే

భవిష్యత్తుకు బాటలు వేసే బోర్డు పరీక్ష (Board Exam)ల్లో మొదటిది టెన్త్‌ ఎగ్జామ్‌ (Tenth Exam). అన్ని పరీక్షల మాదిరిగానే ఇదీ ఒకటి. అయితే ఈ పరీక్ష కెరీర్‌ను నిర్దేశిస్తుంది, అందుకు అవకాశాలను మెరుగుపరుస్తుంది. అసలు పరీక్ష అంటేనే విద్యార్థుల్లో (students) ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. పేషెన్స్‌, కమిట్‌మెంట్‌తో ఒత్తిడిని అధిగమించాలి. బోర్డు ఏదైనప్పటికీ టెన్త్‌ పరీక్షలకు సంబంధించి ప్రిపరేషన్‌ (Preparation) అడుగులు ఈ విధంగా ఉంటే పర్ఫార్మెన్స్‌ మెరుగ్గా ఉంటుంది.

డెఫినెట్‌

‘హ్యాంగింగ్‌ ఫ్రూట్స్‌’. చెట్టుకింద నిలబడి చేతికి అందిన పండ్లను తెంపుకోవడం. చదవాల్సిన వాటి విషయానికొస్తే కచ్చితంగా, ఉజ్జాయింపుగా, వచ్చే అవకాశం అంటూ విడగొట్టుకుని స్టడీ చేయడం అన్నమాట. పరీక్షలు అంటే పుస్తకంలోని మొదటి నుంచి చివరి పేజీ వరకు అన్నింటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎగ్జామ్‌ బ్లూప్రింట్‌కు బదులు మార్కుల స్కీమ్‌లో కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే, మొదట చాప్టర్లు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. వీటిలో ఎగ్జామినర్ల కంటిలో పడేవి కొన్ని ఉంటాయి. వాటి జాబితాను సిద్ధం చేసుకోవాలి. అలా ప్రశ్నలు తప్పకుండా అడిగే చాప్టర్లు ఏవీ అన్నది తేల్చుకోవాలి. ఉదాహరణకు కార్బన్‌ అండ్‌ ఇట్స్‌ కాంపౌండ్‌ - మళ్ళీ అందులో కెమికల్‌ ప్రాపర్టీస్‌ లేదా సోప్‌ యాక్షన్‌ మెకానిజం; ట్రయాంగిల్స్‌ - బీపీటీ/ థేలస్‌ థీరమ్‌ ప్రూఫ్‌, పైథాగరస్‌ థీరమ్‌ వంటివి తీసుకోవాలి.మార్కులకు వీలు కల్పించే చాప్టర్లు అన్నింటినీ ప్రతి సబ్జెక్టు నుంచి గుర్తించాలి. ఆపై కాన్ఫిడెన్స్‌ ఉన్న వాటితో ప్రిపరేషన్‌ మొదలుపెట్టుకోవాలి.

పొమొడొరొ (పీఓఎంఓడిఓఆర్‌ఓ) టెక్నిక్‌

ఇదో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్‌. ఇది బాగా పనిచేస్తుంది. ఉన్న సమయం, అవసరమైన వేగానికి మధ్య సమన్వయానికి తోడ్పడుతుంది. ఈ పద్ధతిలో అతి పెద్ద చాప్టర్‌ను చిన్న చిన్న ముక్కలుగా విభజించుకుని ప్రతి దానికి అర్ధ గంట నుంచి గంట సేపు సమయం కేటాయించుకోవాలి. మధ్యలో అయిదు - పది నిమిషాల బ్రేక్‌తో కనీసం రెండు సార్లయినా రిపీట్‌ చేసుకోవాలి. తదుపరి కనీసం అరగంట సేపు బ్రేక్‌ తీసుకోవాలి. అలా టైమ్‌ నిర్దేశించుకోగలిగితే నిర్దేశించుకున్న సమయంలోనే అనుకున్న టాస్క్‌ పూర్తవుతుంది. అదే మున్ముందు మరింత ప్రొడక్టివ్‌గా రూపొందుతుంది. తద్వారా టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ పెరుగుతాయి.

పాత ప్రశ్నపత్రాలు

కొన్ని టాపిక్స్‌ చాలా కష్టం అనిపిస్తాయి. ఒకపట్టాన కొరుకుడు పడవు. పైపెచ్చు వీటి నుంచి కనీసం ఇరవై నుంచి ఇరవై అయిదు మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఏమి చేయాలి, ఆ మార్కులను ఎలా పొందాలి అన్నది ప్రశ్న. వరల్డ్‌ ఆఫ్‌ లివింగ్‌(సైన్స్‌), ఆల్జీబ్రా(మేథ్స్‌) చాలా మందికి కష్టం. ఇక్కడ స్కోర్‌ కోసం మొదట పాత ప్రశ్నపత్రాలను తిరగేయాలి. తద్వారా తరచూ అడుగుతున్న ప్రశ్నలను తెలుసుకోవాలి. వాటిని ప్రిపేరైతే చాలు, కష్టం అనిపించే టాపిక్స్‌లోనూ మంచి స్కోరింగ్‌కు అవకాశం ఉంటుంది.

iStock-1072477354.gif

బ్లండర్‌ నోట్స్‌

ప్రిపరేషన్‌లో ఎక్స్‌లెన్స్‌ కోసం ఇదో పద్ధతి. చేసిన తప్పులను ఒక దగ్గర రాయాలి. దీన్నే ‘బ్లండర్‌ నోట్స్‌’ అంటారు. చేసిన తప్పు, కరెక్ట్‌ చేసుకున్న విధం పరీక్షలో ఒక ప్రశ్నకు జవాబు రాస్తున్నప్పుడు గుర్తుకు వస్తే చాలు. ఆటోమేటిక్‌గా కరెక్ట్‌గా జవాబు రాయడానికి దోహదపడుతుంది. ఒక రకంగా ఇది ఎర్రర్‌ ఫ్రీ సొల్యూషన్‌. తప్పిదాల నుంచీ నేర్చుకోవడంగానూ చెప్పుకోవచ్చు.

నెమొనిక్స్‌

సెల్ఫ్‌ నోట్స్‌లోని అందాన్ని గుర్తించాలి. సొంతంగా రూపొందించుకున్న నోట్స్‌ మైండ్‌కు కనెక్ట్‌ అవుతుంది. అంతకు మించి స్టోర్‌ అవుతుంది. మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం కూడా సులువు. ట్రిగ్నామెట్రీ, జెనెటిక్స్‌, కార్బన్‌ అండ్‌ ఇట్స్‌ కాంపౌండ్స్‌ వంటి టాపిక్స్‌ను రివిజన్‌ చేసేందుకు కూడా ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుంది. డయాగ్రమ్స్‌, ఫ్లోచార్టులు/షార్ట్‌కట్స్‌, న్యుమోనిక్స్‌తో రూపొందించుకున్న సమాచారాన్ని మర్చిపోవడం కుదరదు. ఈ పద్ధతి విద్యార్థిలో భయాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో ప్రిపరేషన్‌కు సంబంధించి వేగం పెరుగుతుంది. ఉదాహరణకు ప్లీజ్‌ స్టాప్‌ కాలింగ్‌ మి ఎ కేర్‌లెస్‌ జీబ్రా (Please Stop Calling Me A Careless Zebra) పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, కార్బన్‌, జింక్‌ - ఇది కెమిస్ట్రీ (Chemistry) రియాక్టివిటీ సిరీస్‌ ఆర్డర్‌. ఇలాంటి బండ గుర్తులను టీచర్లు (Teachers) కూడా చెబుతారు. కొందరు విద్యార్థులు తమకు తాము రూపొందించుకుంటారు. సులువుగా గుర్తుంచుకునేందుకు ఇంకా బాగా చెప్పాలంటే అస్సలు మర్చిపోకుండా ఉండేందుకు ఇలాంటి టెక్నిక్స్‌ (techniques) ఉపయోగపడతాయి.

అసలు ఫన్‌ లేకుండా మార్కులు వస్తాయనుకోవడమే తప్పు. సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో చక్కగా గడపాలి. ఆ సమయంలో ఆనందంగా ఉండేలా చూసుకుంటే మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆరోగ్యంపై కూడా దృష్టిసారించాలి. అలా అన్నింటికి ప్రాధాన్యం ఇస్తూ, చదువుకోవడంలో మమేకం కావాలి. అలా పరీక్షలు రాసేందుకు సన్నద్ధమైతే చాలు, మొత్తం ఎపిసోడ్‌ ఫలితాన్నిచ్చేదిగా మారుతుంది. సదా నేర్చుకోవడమే సరైన పద్ధతి.

- మానికా గౌతమ్‌, మేనేజర్‌, సెంట్రల్‌ అకడమిక్‌ టీమ్‌ బైజూస్‌(BYJUS)

Updated Date - 2023-01-05T15:46:20+05:30 IST