Share News

Gold Rates: బిగ్ షాక్.. రూ.లక్షకు చేరనున్న బంగారం

ABN , Publish Date - Apr 03 , 2025 | 07:11 PM

Shocking News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బాట పట్టాడు. అన్ని దేశాలకు సుంకాలు విధించాడు. దీంతో బంగారం ధర ఆకాశాన్ని తాకనుందనే అభిప్రాయం మార్కెట్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేలు దాటిపోయింది. ఇక ఆ ధర రూ. లక్ష చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదనే చెబుతున్నారు.

Gold Rates: బిగ్ షాక్.. రూ.లక్షకు చేరనున్న బంగారం
Gold Rates

హైదరాబాద్, ఏప్రిల్ 03: భారత్ సహా ప్రపంచంలోని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో బంగారం ధర ఆకాశానంటుతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే 10 గ్రాముల బంగారం ధర త్వరలో రూ.లక్షకు చేరుకోనుందని వారు చెబుతున్నారు. అయితే జస్ట్ ఒక మాసం క్రితం అంటే.. మార్చి 2వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ.85,320గా ఉంది. కానీ ఒక నెల రోజులకు అంటే.. ఏప్రిల్ 2వ తేదీకి రూ.11,983 పెరిగి.. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 91, 115గా స్థిరంగా ఉంది. ఇక ప్రపంచ మార్కెట్‌లో బంగారం మాత్రం కొత్త రికార్డులు సృష్టించేందుకు పరుగులు పెడుతోంది. అదీకాక.. బంగారం ధరలు అల్ టైమ్ హైలో కొనసాగుతోన్నాయి. పర్ ఔన్స్ బంగారం రూ.3,148.88 డాలర్లుగా ఉంది. అంతుకు ముందు రూ.3,132.53 డాలర్ల వద్ద ఈ ధర స్థిరంగా ఉంది.

ఇక ప్రపంచ మార్కెట్‌లో బంగారం రికార్డులను సృష్టిస్తోంది. స్పాట్ బంగారం ధర ఔన్సుకు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 3,148.88 డాలర్లకు చేరుకుంది. అనంతరం రూ.3,132.53 డాలర్ల వద్ద స్థిరపడింది.ఇక యూఎస్ గోల్డ్ ఫ్యూచర్ సైతం 0.4% పెరిగి రూ. 3,164.20 డాలర్లకు చేరుకుంది.


ఈ పరిస్థితుల్లో బంగారం ధరలు చుక్కలను తాకుతొందనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉందని పలువురు పేర్కొంటున్నారు. కానీ 10 గ్రాముల బంగారం ధర రూ.లక్ష చేరడం అసాధ్యమని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే 10 గ్రాముల బంగారం ధర రూ. లక్ష చేరడానికి.. ఇంకా రూ. 9 వేలు పెరగాల్సి ఉందన్నారు. కానీ అంత ధర ఈ మధ్య పెరగే అవకాశం లేదనే అభిప్రాయాన్ని సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదీ ఏమైనా 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షకు చేరుకొంటే మాత్రం .. ఆ యా దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడక పోవచ్చుననే అభిప్రాయం సామాన్య మానవుడిలో మొదలైంది.

ఈ వార్తలు కూడా చదవండి..

No Visa: వీసా లేకుండా.. ఇండియన్ పాస్ పోర్ట్‌తో 62 దేశాలు చుట్టేయచ్చు

Trump's Reciprocal Tariffs: కొత్త అవకాశాలను అధ్యయనం చేస్తున్నాం: భారత్

Updated Date - Apr 03 , 2025 | 07:19 PM