Share News

High Court: వైవాహిక అత్యాచారం నేరంకాదు.. అలహాబాద్ హైకోర్టు తీర్పు

ABN , First Publish Date - 2023-12-10T13:13:22+05:30 IST

వైవాహిత(Marrital) అత్యాచారం నేరంకాదని అలహాబాద్ హైకోర్టు(Alahabad High Court) సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లయ్యాక ఇష్టం లేకున్నా భర్త కలవడానికి ప్రయత్నించి, హింసించాడని ఓ భార్య వేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.

High Court: వైవాహిక అత్యాచారం నేరంకాదు.. అలహాబాద్ హైకోర్టు తీర్పు

గాంధీనగర్: వైవాహిత(Marrital) అత్యాచారం నేరంకాదని అలహాబాద్ హైకోర్టు(Alahabad High Court) సంచలన తీర్పు వెలువరించింది. పెళ్లయ్యాక ఇష్టం లేకున్నా భర్త కలవడానికి ప్రయత్నించి, హింసించాడని ఓ భార్య వేసిన పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. పిటిషన్ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

భార్యకు 18 ఏళ్లు నిండితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం(IPC).. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. బాధిత భర్త అసహజ నేరం ఆరోపణలు ఎదుర్కొంటుండగా అతన్ని నిర్దోషిగా తేల్చింది. ఈ తీర్పును జస్టిస్ రామ్‌మనోహర్ నారాయణమిశ్రా వెలువరించారు.

వివాహంతోనే భార్యభర్తల మధ్య లైంగిక చర్య హక్కుగా వస్తుందని.. ఇందులో బలవంతం చేయడం నేరం కాబోదని, ఎలాంటి క్రిమినల్ పెనాల్టీ ఉండదని కోర్టు స్పష్టం చేసింది.

అయితే బాధితుడితోపాటు అతని బంధువులు ఆమెను గాయపరచడం, క్రూరంగా వ్యవహరించారన్న అభియోగాల్లో మాత్రం భర్తను దోషిగా తేల్చింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. ఈ తరుణంలో అలహాబాద్, మధ్యప్రదేశ్ హైకోర్టుల తాజా తీర్పులు ఆసక్తికరంగా మారాయి.

Updated Date - 2023-12-10T13:14:41+05:30 IST