Bhim Jewels Campaign: బంగారం అంటే భీమ
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:55 AM
భీమ జువెల్స్ ‘బంగారం అంటే భీమ’ పేరుతో రామ్‌చరణ్‌తో ప్రత్యేకంగా క్యాంపెయిన్ ప్రారంభించింది. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఆభరణాలు ఇందులో ప్రదర్శించనున్నాయి

రామ్‌చరణ్‌తో సరికొత్త ప్రచారం ప్రారంభం: భీమ జువెల్స్
హైదరాబాద్: ప్రముఖ జువెలరీ రిటైలర్ భీమ జువెల్స్.. ‘బంగారం అంటే భీమ’ పేరుతో సరికొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. సంస్థ బ్రాండ్ అంబాసిడర్ రామ్‌చరణ్‌తో ప్రత్యేకంగా ఈ క్యాంపెయిన్‌ను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సంస్కృతులు ప్రతిబింబించే విధంగా దీన్ని రూపొందించినట్లు భీమ జువెల్స్ వెల్లడించింది ఈ క్యాంపెయిన్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని సంస్కృతులకు ప్రతిరూపాలైన హారాలు, వడ్డాణాలు, గుట్టపూసలు, చోకర్స్, నక్షి గాజులు, జుమ్కీలు వంటి ఆభరణాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ప్రతి ఆభరణాన్ని భీమ జువెల్స్ పూర్తిగా నిబద్దతతో తయారు చేసిందని పేర్కొంది. అంతేకాదు తెలుగు వారి వేడుకలు, వివాహాల్లో ఈ బంగారు ఆభరణాలు ముఖ్యమైన భాగంగా ఉంటాయని తెలిపింది. బంగారం అంటే భీమ అనేది ఒక క్యాంపెయిన్ మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారాన్ని ఇష్టపడే వారికి ఒక ప్రత్యేకమైన వేడుక అని భీమ జువెల్స్ ఎండీ అభిషేక్ బిందుమాధవ్ అన్నారు.