Infosys Foundation : సుధా మూర్తి ఆహారపు అలవాట్లపై దుమారం
ABN , First Publish Date - 2023-07-26T09:58:53+05:30 IST
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి (Infosys Foundation chairperson Sudha Murty) ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాను సంపూర్ణ శాకాహారినని చెప్తూ, మాంసాహారం కోసం ఉపయోగించే గరిటెలను శాకాహారం కోసం కూడా వాడతారేమోననే భయంతో తాను హోటళ్లను ఎంపిక చేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాన్నారు.
న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి (Infosys Foundation chairperson Sudha Murty) ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాను సంపూర్ణ శాకాహారినని చెప్తూ, మాంసాహారం కోసం ఉపయోగించే గరిటెలను శాకాహారం కోసం కూడా వాడతారేమోననే భయంతో తాను హోటళ్లను ఎంపిక చేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఆమె చెప్పడంతో, ఆమెకు కొందరు ట్విటరాటీలు చురకలంటిస్తున్నారు. ఆమె అల్లుడు, బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ (Rishi Sunak) మాంసాహారి అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనను ఆయన పిల్లలను ముట్టుకోవద్దని సలహా ఇస్తున్నారు.
తనకు ఆహారం అంటే ఇష్టమే అయినప్పటికీ, తాను రకరకాల తినుబండారాలను తయారు చేయలేనని చెప్పారు. అయితే టీ, అటుకులతో తయారు చేసే పదార్థాలను బాగా చేయగలనని తెలిపారు. సాధారణ వంటకాలను మాత్రమే తయారు చేయగలనని చెప్పారు. అందుకే తన భర్త ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి బరువును సరైన రీతిలో కొనసాగించగలుగుతున్నారన్నారు. పరోటాలు, పప్పు, కూర, అన్నం, సాంబారు తయారు చేయగలనని చెప్పారు. తాము హోటళ్లకు వెళ్లబోమని, తేలికగా తయారయ్యే వంటకాలను వండగలనని తెలిపారు. తాను ఎల్లప్పుడూ బయట, విదేశాల్లో పని చేసినందువల్ల ప్రత్యేక వంటకాలను తయారు చేయడం నేర్చుకోలేదన్నారు. విదేశాలకు వెళ్లేటపుడు 25 నుంచి 30 చపాతీలను, రోస్టెడ్ సూజీని పట్టుకెళ్తానని చెప్పారు. వేడి నీటిని కలిపి, వెంటనే తినేయడానికి వీలుగా ఇవి ఉంటాయన్నారు. తనతోపాటు ఓ కుక్కర్‌ను కూడా తీసుకెళ్తానని చెప్పారు. ఇవన్నీ తన అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానని తెలిపారు. ఏ దేశానికి వెళ్లినా, తన ఆహారాన్ని తానే తీసుకెళ్తానని చెప్పారు.
దీంతో ట్విటరాటీలు రంగంలోకి దిగారు. సుధా మూర్తి అల్లుడు, బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ (Prime Minister Rishi Sunak) మాంసాహారాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపించే ఫొటోలను షేర్ చేశారు. రుషి వద్ద ఆమె కోసం వేర్వేరు గరిటెలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.
మరో ట్విటరాటీ స్పందిస్తూ, ముస్లింల యాజమాన్యంలోని సంస్థల్లో కనీసం టీ అయినా ఆమె తాగుతారా? అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
Khushboo: వెనక్కి తగ్గారు.. ఖుష్బూ ట్వీట్.. ఆనక తొలగింపు.. అసలు విషయమేంటంటే..
Electricity: నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..