Guinness World Records: గిన్నిస్ రికార్డులో మేక.. ప్రత్యేక ఏంటో తెలుసా?
ABN , Publish Date - Mar 27 , 2025 | 05:49 PM
ఆ మేకను చూసిన వాళ్లు ఆశ్చర్యపోయే వారు. గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం ప్రయత్నించమని పీటర్‌కు సలహా ఇచ్చారు. దీంతో అతడు గిన్నిస్ బుక్ వారిని సంప్రదించాడు. ఆ మేకను పరిశీలించిన తర్వాత రికార్డును ఫైనల్ చేశారు.

దేవుడి సృష్టిలో వింతలకు, విశేషాలకు కొదువలేదు. తెలుసుకునే కొద్దీ మనకు ఆశ్చర్యం, విసుగు తప్ప వాటికి లోటు ఉండదు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం నలుమూలల ఉన్న వింతల్ని, విశేషాల్ని ఇంట్లో కూర్చుని మొబైల్ ఫోన్‌లో చూసేస్తున్నాము. తాజాగా, మన ఇండియాకు చెందిన ఓ మేక ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించేంత ప్రత్యేకత ఆ మేకలో ఏముంది అనుకుంటున్నారా?.. ఆ మేక కచ్చితంగా ప్రత్యేకమైనదే.. ఆ మేక ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
కేరళకు చెందిన పీటర్ లేను అనే వ్యక్తి పలు రకాల పశువుల్ని సాకుతూ ఉన్నాడు. వాటిలో మేకలు కూడా ఉన్నాయి. 2021లో ఓ మేక పుట్టింది. దానికి అతడు కరుంబి అని పేరు పెట్టాడు. దాన్ని ఎంతో ఆప్యాయంగా పెంచుకుంటూ ఉన్నాడు. పుట్టి నెలలు గడుస్తున్నా.. కరుంబి ఎత్తు పెరగలేదు. పొట్టిగానే ఉండిపోయింది. మిగిలిన మేకలతో పోలీస్తే కరుంబి చాలా పొట్టిది. ఆ మేకను చూసిన కొంతమంది పీటర్‌కు ఓ సలహా ఇచ్చారు. గిన్నిస్ రికార్డులో స్థానం కోసం ప్రయత్నించమన్నారు. వారి సలహా పీటర్‌కు బాగా నచ్చింది. గిన్నిస్ రికార్డు వాళ్లను సంప్రదించాడు. గిన్నిస్ రికార్డు వాళ్లు వచ్చి మేకను పరిశీలించారు. కొలతలు తీసుకున్నారు. కరుండి కేవలం 1 అడుగు 3 ఇంచులు మాత్రమే ఉంది.
దాన్ని సెంటీమీటర్లలో చెప్పాలంటే కేవలం 40 సెంటీమీటర్లు మాత్రమే. దీంతో కరుంబి పాత రికార్డును తుడిచిపెట్టింది. కొత్త రికార్డు సృష్టించింది. కరుంబి గిన్నిస్ రికార్డులోకి ఎక్కటంతో పీటర్ సంతోషం పట్టలేకపోయాడు. కరుంబి గురించి మాట్లాడుతూ.. ‘ కరుంబి చాలా చక్కగా అన్నిటితో కలిసిపోతుంది. మనుషులతో కూడా బాగా ప్రవర్తిస్తుంది. కరుంబి ప్రస్తుతం గర్భవతి. రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ బిడ్డలతో మరో రికార్డు బ్రేక్ చేస్తాం’అని అన్నాడు. ఇక, కరుంబికి సంబంధించిన వీడియోను గిన్నిస్ రికార్డు వాళ్లు తమ అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
AP News: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ నిధులు విడుదల
Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..