Share News

Amith Shah: బిల్లులు అమోదం వేళ.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 27 , 2025 | 09:26 PM

Amith Shah: లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. అలాంటి వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బంగ్లాదేశ సరిహద్దులో కంచె వేసే కార్యక్రమం ఆగిపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా పలు ఆరోపణలు గుప్పించారు.

Amith Shah: బిల్లులు అమోదం వేళ.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మార్చి 27: విదేశాల నుంచి పర్యాటకులుగా, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం చేసుకొనేందుకు భారత్ రావాలనుకునే వారిని స్వాగతించడానికి తమ దేశం సిద్దంగా ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కానీ బెదిరింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. గురువారం ఇమ్మిగ్రేషన్, విదేశీయుల బిల్లు -2025ను గురువారం లోక్‌సభలో ఆమోదించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రవేశించి అశాంతి సృష్టించాలని కొంత మంది చూస్తున్నారని ఆరోపించారు.

అలాంటి వారికి ఈ దేశం ఆశ్రయం కల్పించదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అటువంటి వారి పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లులను రూపొందించినట్లు అమిత్ షా వివరించారు. తమ దేశాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు వస్తే.. వారికి ఎల్లవేళలా స్వాగతిస్తామన్నారు. మన దేశానికి వచ్చే ప్రతి విదేశీయుడి గురించి తాజా సమాచారం మన దగ్గర ఉంటుందని ఈ సందర్భంగా భారత్‌కు హామీ ఇవ్వాలనుకుంటున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.


ఈ బిల్లు దేశ భద్రతను బలోపేతం చేయడంతోపాటు 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారడానికి సహాయపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మయన్మార్ నుండి రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడుతున్న అంశంపై అమిత్ షా స్పందించారు. వ్యక్తిగత లాభం కోసం భారత్‌లో ఆశ్రయం పొందుతోన్న వ్యక్తులు పెరిగారన్నారు. దీంతో దేశ భద్రతపై ఆయన ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు.


భారత్‌లో అశాంతిని సృష్టిస్తే మాత్రం చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబాట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే ఈ ఇరుదేశాల మధ్య కంచె వేసేందుకు పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మోకాలడ్డుతోందని విమర్శించారు. అందులోభాగంగానే 450 కిలోమీటర్ల మేర ఈ ప్రక్రియ ఆగిపోయిందన్నారు.


ఇదే అంశంపై మమతా బెనర్జీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 11 లేఖలు రాసిందని.. అలాగే ఆ రాష్ట్ర అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపిందననారు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం రాలేదని పెదవి విరిచారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని 24 పరిగణాల జిల్లాలో ఆధార్ కార్డులన్నీ నకిలీవేనని చెప్పారు. అయితే అందులో వచ్చిన ఇబ్బంది ఏమీలేదని.. ఎందుకంటే.. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. తద్వారా ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఈ తరహా కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెడతామని కేంద్ర మంత్రి అమిష్ షా జోస్యం చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Stuff Chicken: మందు తాగేటప్పుడు.. చికెన్ తింటే ఏమవుతోంది

Top Secret: చనిపోయే ముందు శరీరంలో మొదట ఆగిపోయే అవయవం ఏదింటే..

Iftar Party: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై

Night Food: రాత్రుళ్లు ఈ ఆహారం తీసుకోండి.. షుగర్ రమ్మనా రాదు..

Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి

Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్

LRS : ఎల్ఎస్ఆర్‌ లీల.. రూ. 14 లక్షల భూమికి రూ. 28 కోట్ల ఎల్ఆర్ఎస్ ఛార్జెస్..

ఈ పువ్వుతో ఇన్ని లాభాలున్నాయా..?

For National News And Telugu News

Updated Date - Mar 27 , 2025 | 09:29 PM