177th Anniversary: కందుకూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Mar 28 , 2025 | 05:26 AM
ఆంధ్రప్రదేశ్‌లో కందుకూరి వీరేశలింగం పంతుల 177వ జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయిలో కళాకారులకు విశిష్ట పురస్కారాలు అందించనున్నారు. అభ్యర్థులు ఏప్రిల్ 7లోగా దరఖాస్తు చేయాలని కళాశాఖ సూచించింది

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): కందుకూరి వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా కళాకారులకు రాష్ట్రస్థాయిలో విశిష్ఠ పురస్కారాలు అందజేస్తున్నట్లు రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ హిమాన్షు శుక్లా తెలిపారు. ఏప్రిల్ 16న అందించబోయే పురస్కారాలకు రాష్ట్రంలోని రచయితలు, దర్శకులు, కళాకారులు, సాంకేతిక నిపుణులు ఏప్రిల్ 7లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించబోమని, జిల్లా స్థాయి పురస్కారాలు అందుకున్న వారు రాష్ట్ర స్థాయికి అర్హులని శుక్లా వివరించారు. దరఖాస్తులను విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ పరిపాలనా భవనం నాలుగో అంతస్తులో నేరుగా అందజేయవచ్చన్నారు. దరఖాస్తు ఫారంను ఠీఠీఠీ.్చఞటజ్టఠ్టిఛీఛి.జీుఽ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
For More AP News and Telugu News