IRS officer: అధికారుల్లో వృత్తి నైపుణ్యం పెరగాలి
ABN , First Publish Date - 2023-02-01T10:01:49+05:30 IST
ప్రపంచమంతా గ్లోబల్ హబ్‌గా మారిన నేటి పరిస్థితుల్లో ప్రజా సంబంధ అధికారులు వృత్తినైపుణ్యం మరింత పెంచుకోవాలని ఆలిండియా క

- ఐఆర్‌ఎస్ అధికారి డా.ఎం.జగన్నాథన్
ప్యారీస్(చెన్నై), జనవరి 31: ప్రపంచమంతా గ్లోబల్ హబ్‌గా మారిన నేటి పరిస్థితుల్లో ప్రజా సంబంధ అధికారులు వృత్తినైపుణ్యం మరింత పెంచుకోవాలని ఆలిండియా కస్టమ్స్ అండ్ జీఎస్టీ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ డా.ఎం.జగన్నాథన్(Dr. M. Jagannathan) పేర్కొన్నారు. కోవై జిల్లా పొల్లాచ్చిలోని కస్టమ్స్, జీఎస్టీ కార్యాలయంలో మంగళవారం పదవీవిరమణ పొందిన జగన్నాథన్‌కు వీడ్కోలు సభ నిర్వహించారు. చెన్నై కస్టమ్స్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం తరఫున అధ్యక్షుడు కలైకుమార్, ఉపాధ్యక్షుడు పి.ఆదిలక్ష్మణ్, మునుస్వామి, ప్రధాన కార్యదర్శి ఆర్.గోపాలకృష్ణన్, ట్రెజెరర్ ఎంఎస్ కార్తికేయన్, బి.రమేష్‌బాబు, తూత్తుకుడి కస్టమ్స్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం తరఫున అసిస్టెంట్ కమిషనర్ బాబూరావు, సూపరింటెండెంట్ మురుగన్ తదితరులు ఐఆర్‌ఎస్ అధికారిగా ఉత్తమసేవలందించిన జగన్నాథన్‌ను శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేసి అభినందించారు.