Kodaikanal: కొడైకెనాల్‌లో సందర్శనకు ఒకే టికెట్
ABN , First Publish Date - 2023-01-17T12:44:14+05:30 IST
ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కొడైకెనాల్‌లోని అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఒకే టికెట్ ఇస్తున్నారు. కొడైకెనాల్(Kodaikanal)లో పర్యాటకులకు

పెరంబూర్(చెన్నై), జనవరి 16: ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కొడైకెనాల్‌లోని అన్ని ప్రాంతాలను సందర్శించేందుకు ఒకే టికెట్ ఇస్తున్నారు. కొడైకెనాల్(Kodaikanal)లో పర్యాటకులకు ఆహ్లాదం కలిగించే రీతిలో ఉద్యానవన, అటవీ శాఖలు అరుదైన పూలతో పార్క్‌లు ఏర్పాటుచేశాయి. ఈ ప్రాంతంలోని మేయర్ స్క్వయర్, ఫైన్ పారెస్ట్, గుణ గుహాలు, తూన్‌పారై తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల నుంచి వేర్వేరు ప్రవేశ రుసుము వసూలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అన్ని పర్యాటక ప్రాంతాలను ఒకే టిక్కెట్టుపై సందర్శించేలా అటవీశాఖ చర్యలు చేపట్టి, పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.15 ధర నిర్ణయించింది. ఈ విధానం ఆదివారం నుంచి అమలుకు వచ్చిందని అధికారులు తెలిపారు.