One nation, One Election: 2024లో జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు.. లా కమిషన్ అభిప్రాయం..!

ABN , First Publish Date - 2023-09-29T17:47:39+05:30 IST

వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు లోక్‌సభతో పాటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్తి తెలిపారు.

One nation, One Election: 2024లో జమిలీ ఎన్నికలు సాధ్యం కాదు.. లా కమిషన్ అభిప్రాయం..!

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అటు లోక్‌సభతో పాటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు (Simultaneous polls) నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ (Law commission) అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్తి గత ఇటీవల తెలిపారు. నివేదికకు కొంత సమయం పడుతుందని, ఇందుకు సంబంధించిన పని ప్రస్తుతం జరుగుతోందని చెప్పారు


కాగా, లా కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం, జమిలి ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ పరమైన సవరణలు చేయాలని లా కమిషన్ తన నివేదికలో సూచించనుంది. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణపై 2022 డిసెంబర్ 22న లా కమిషన్ ఆరు ప్రశ్నలను జాతీయ రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల కమిషన్, బ్యూరోక్రాట్లు, విద్యావేత్తలు, నిపుణుల ముందు ఉంచింది. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుపుతున్న లా కమిషన్, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ నివేదకను పబ్లిష్ చేయనుందని, కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సమర్పించనుందని తెలుస్తోంది.


దీనికి ముందు, 2018లో 21వ లా కమిషన్ ముసాయిదా నివేదికను కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని, అడ్మినిస్ట్రేషన్‌ పైన, భద్రతా బలగాలపైన భారం తగ్గుతుందని, ప్రభుత్వ పథకాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు వీలవుతుందని ఆ నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ ఫ్రేమ్‌వర్క్‌లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని కమిషన్ అభిప్రాయపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లో సంబంధిత ప్రొవిజన్లను సవరించాలని కూడా సిఫారసు చేసింది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-09-29T17:57:54+05:30 IST