Share News

Vegetarians Report: అత్యధిక శాకాహారులు కలిగిన దేశం ఏది? భారత్ ఏ స్థానంలో ఉంది?

ABN , First Publish Date - 2023-12-02T13:34:35+05:30 IST

భోజనప్రియుల్లో రెండు రకాల వారు ఉంటారు. ఒకటి.. మాంసాహారులు, రెండు.. శాకాహారులు. మాంసాహారులు ఎలాంటి ఫుడ్స్ తింటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఫలానా ఫుడ్ తినాలనే పరిమితి లేకుండా.. అన్ని రకాల వంటకాలను భుజిస్తారు.

Vegetarians Report: అత్యధిక శాకాహారులు కలిగిన దేశం ఏది? భారత్ ఏ స్థానంలో ఉంది?

World Atlas Report: భోజనప్రియుల్లో రెండు రకాల వారు ఉంటారు. ఒకటి.. మాంసాహారులు, రెండు.. శాకాహారులు. మాంసాహారులు ఎలాంటి ఫుడ్స్ తింటారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఫలానా ఫుడ్ తినాలనే పరిమితి లేకుండా.. అన్ని రకాల వంటకాలను భుజిస్తారు. కానీ.. శాకాహారులు మాత్రం మాంసం ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఆకుకూరలు, కూరగాయలనే ప్రధానంగా తింటారు. వీగన్ అనే మరో కేటగిరీకి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. వెజిటేరియన్, వీగన్.. చూడ్డానికి ఈ రెండు ఒకేలా ఉన్నప్పటికీ కాన్సెప్టులు మాత్రం పూర్తి భిన్నమైవని. వీగన్స్.. పాలు, తేనెతో సహా అన్ని రకాల జంతు ఉత్పత్తులను పూర్తిగా నివారిస్తారు.

ఇదిలావుండగా.. వరల్డ్ అట్లాస్ ఇటీవల అత్యధిక శాఖాహారులు అత్యధికంగా ఉండే దేశాలకు సంబంధించి ఒక జాబితాను రూపొందించింది. ఈ నివేదికలో.. భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం దేశ జనాభాలో 38 శాతం మంది శాకాహారులు ఉన్నారని తేలింది. 6వ శతాబ్దంలో (బీసీ కాలం) బౌద్ధమతం, జైనమతం పరిచయం అయినప్పటి నుంచే ఈ శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు గుర్తించవచ్చు. భారత్‌లోని శాకాహారుల్లో కొంతమంది లాక్టో-శాఖాహారానికి కట్టుబడి ఉంటారు. వీళ్లు తమ ఆహారంలో పాల ఉత్పత్తులు చేర్చుకుంటారు కానీ.. గుడ్లు మాత్రం తినరు. ఈ విభిన్నమైన ఆహార విధానాలు భారతదేశపు సాంస్కృతిక, చారిత్రక ప్రభావాలను ప్రతిబింబిస్తాయి.


మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మాంసం వినియోగ రేటులో ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. ఇలా ప్రజలు శాకాహారం వైపు మొగ్గు చూపడానికి.. ఆరోగ్యం, పర్యావరణ ఆందోళనలు లేదా ఇతర కారణాలు ఉండొచ్చని నివేదిక సూచిస్తోంది. మతం, నైతిక ప్రేరణలు, ఆర్థిక పరిగణనలు, మాంసం పట్ల అసహ్యం, సాంస్కృతిక ప్రభావాలు వంటి అంశాలు కూడా ఈ ధోరణికి దోహదపడతాయని ఈ నివేదిక పేర్కొంటోంది. ఇక లింగాయత్‌లు, బ్రాహ్మణులు, జైనులు, వైష్ణవులు వంటి వాళ్లు కేవలం శాకాహారమే తీసుకుంటారన్నది అందరికీ తెలుసు. ఇక భారత్ తర్వాత ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొంది.

ఇజ్రాయెల్‌లో ఉన్న మొత్తం జనాభాలో 18 మంది శాకాహారులు ఉన్నట్టు వరల్డ్ అట్లాస్ వెల్లడించింది. ఇజ్రాయెల్‌లో శాకాహార భావనను ప్రవేశపెట్టడంలో జుడాయిజం కీలక పాత్ర పోషించింది. దీని తర్వాత తైవాన్, ఇటలీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. తైవాన్‌లో 12 శాతం, ఇటలీలో 10 శాతం మంది శాకాహారులున్నట్టు ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇక ఆస్ట్రియా, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, బ్రెజిల్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా దేశాలు వరుసగా 5, 6, 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.

Updated Date - 2023-12-02T13:34:37+05:30 IST