anti-ageing food: ఎప్పుడూ యంగ్‌గా కనిపించాలంటే ఈ ఫుడ్ తింటే చాలు.. ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే!

ABN , First Publish Date - 2023-04-10T22:50:59+05:30 IST

బచ్చలికూరను అనేక రకాలుగా తీసుకోవచ్చు.

anti-ageing food: ఎప్పుడూ యంగ్‌గా కనిపించాలంటే ఈ ఫుడ్ తింటే చాలు.. ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండేవే!
skin health

కొన్ని పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే అన్ని పదార్థాలను వరుసపెట్టి ఆరోగ్యం పెరుగుతుందని పొట్టలో వేసేయడం కాకుండా ఆరోగ్యాన్ని పెంచేవి, శరీరానికి హానికలిగించని పదార్థాలను ఎంచుకుని వాటిని మాత్రమే తీసుకుంటూ ఉండాలి. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు నవ యవ్వనాన్ని కూడా ఇస్తాయి, ఆ పదార్థాలు ఏమిటంటే...!

1. క్యాప్సికమ్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని పై తొక్క, గింజలు కూడా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. క్యాప్సికమ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యాప్సికమ్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. థర్మోజెనిసిస్ ఇందులో కనిపిస్తుంది. ఇది మన శరీరంలోని క్యాలరీలను చాలా వేగంగా కరిగిస్తుంది.

2. బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది. విటమిన్‌ బి నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. కెరోటిన్‌, ఎ, బి, సి, ఇ విటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్‌ ఆమ్లాలు, పీచు వంటి పోషకాలు బొప్పాయిపండులో పుష్కలం.

3. పసుపు (లాటిన్ Curcuma longa) అల్లం (Zingiberaceae) జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు. వంటలకు వాడే మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది.

ఇది కూడా చదవండి: వయసు 40 దాటిందా..? నాలుగు రోజులు ఎక్కువ బతకాలంటే ఈ ఆరు విషయాల్లో జాగ్రత్త పడక తప్పదు..!

4. బ్లూబెర్రీస్ లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే , మాంగనీస్ లభిస్తుంది. బ్లూ బెర్రీస్ లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బ్లూబెర్రీస్ ను తింటే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. ఇందులో విటమిన్ సి సమృద్ధిగా లభించడం వల్ల ఈ బెనిఫిట్ అందుతుంది.

5. అవకాడోలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, గుండె జబ్బుల ముప్పును తగ్గించడానికి, మెదడు కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. దీనిలో మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వుల శాతం, దీనితో పాటు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి6లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని అల్పాహారం, భోజనం, విందు ఆహారంలో కలిపి తీసుకోవచ్చు.

6. మతిమరపు, డిప్రెషన్, టెన్షన్ వంటివి కలిగి ఉండేవారు టమాటాలు తినాలి. వాటిలోని బి, ఇ విటమిన్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్, కళ్లకు మేలు చేస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.

7. బచ్చలికూర (Spinacia oleracea) అనేది పర్షియాలో ఉద్భవించిన ఆకు పచ్చని కూరగాయ. ఇది అమరాంత్ కుటుంబానికి చెందినది. దుంపలు, క్వినోవాకు సంబంధించినది. ఇంకా , ఇది పోషకాలు , యాంటీఆక్సిడెంట్లతో ఆరోగ్యకరమైనది. బచ్చలికూరను అనేక రకాలుగా తీసుకోవచ్చును.

7. వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి.

8. క్యాలీఫ్లవర్‌లో కాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు,ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, విటమిన్ ఎ, బి, సి,పొటాషియం కూడా ఉంటుంది.

Updated Date - 2023-04-10T22:50:59+05:30 IST