Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్‌ను వెంటనే పెంచే 10 ఆహారాలు ఇవి.. ఎందుకైనా మంచిది ముందే తెలుసుకోండి!
ABN , First Publish Date - 2023-04-11T11:31:41+05:30 IST
పాలలోని లాక్టోస్ నుండి లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది
మనం తీసుకునే చాలా ఆహారపదార్థాలలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి మంచిది కాదని, తీసుకునే ఆహారాన్ని కాస్త గమనించి తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నాకూడా చాలా వరకూ ఆకలి వేసింది కదాని, లేదా నోటికి రుచి కావలసినప్పుడుల్లా కావలసిన పదార్ధాలను కడుపులో పడేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఆహారం శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను నింపేస్తుంది. దీనితో లేనిపోని రోగాల భారిన పడతాం. అలా కాకుండా మనలో చాలా వరకూ తీసుకునే ఆహారంపై అవగాహన ఉంటే కనక శరీరంలో అధిక కొవ్వు వచ్చి చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందులో ఏ పదార్ధాలు శరీరంలో కొవ్వును పెంచుతాయో చూద్దాం.
1. గుడ్లు
గుడ్డు ఖనిజాల గని. శరీరానికి ఉపయోగపడే ధాతువులు 45 అయితే గుడ్డులో 44 ధాతువులు ఉన్నాయి. గుడ్డులో మరీ ముఖ్యంగా పచ్చసొనలో 12 ఖనిజాలు, 8 లవణాలు ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలెస్ర్టాల్ అన్ని రకములైన జీవక్రియకు ఉపయోగపడుతుంది.
2. చీజ్
చీజ్ తేలికగా ఉండడం, దీర్ఘకాలం నిలువ ఉండడం, కొవ్వు, మాంసకృత్తులు, కాల్షియం, భాస్వరం అధికంగా ఉండడం మీద చీజ్ విలువ ఆధారపడి ఉంటుంది. చీజ్ ఎక్కువ కాంపాక్ట్‌గాఉండి, పాలు కంటే దీర్ఘకాలం నిలువ ఉంటుంది. అయితే చీజ్ ఎంతకాలం నిలువ ఉంటుంది అనేది చీజ్ తయారీవిధానం మీద ఆధారపడి ఉంటుంది.
ఇది కూడా చదవండి : ఎటువంటి ఫ్లాట్ ఎంచుకుంటున్నారు. దానికి ఈ దిశలు చాలా ముఖ్యం.. గమనించి తీసుకుంటే ఫలితాలు అద్భుతం..!
3. షెల్ఫిష్ శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా తింటారు. అవి లీన్ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. క్రమం తప్పకుండా షెల్ఫిష్ తినడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మెదడు, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అయినప్పటికీ, షెల్ఫిష్ అత్యంత సాధారణ ఆహార అలెర్జీ కారకాలలో ఒకటి.
4. మాంసం కాలేయంలో కేలరీలు: 153, ప్రోటీన్: 23 గ్రాములు, కొవ్వు: 4 గ్రాములు, పిండి పదార్థాలు: 4 గ్రాములు, ఫైబర్: 0 గ్రాములు ఉంటాయి.
5. ప్రతి భారతీయ ఇంట్లో పెరుగు ఒక సాధారణ ఆహారం. శాస్త్రీయంగానే కాకుండా ఆర్యోగంగా కూడా వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. పాలతో తయారు చేసే పెరుగులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వెనిగర్ లేదా నిమ్మరసంలో ఉండే ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, కాల్షియం లోపాన్ని నివారిస్తుంది. పాలలోని లాక్టోస్ నుండి లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి అవుతుంది ఇది జీర్ణ క్రియలో ఉపయోగపడుతుంది.
6. ఈ చిన్న చేపలు అనేక ఆరోగ్య పరిస్థితులను నివారించడంలో ప్రయోజనకరంగా ఉండే పోషకాలతో నిండి ఉన్నాయి. ఈ పోషకాలలో కొన్ని గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి లేదా కొన్ని క్యాన్సర్‌ల నుండి రక్షించగలవు.
7. సార్డినెస్ కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు సిఫార్సు చేస్తారు. వాటిలో కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
8. వీటితో పాటు ఫ్రైడ్ ఫుడ్స్, ప్రోసెస్డ్ ఫుడ్, ప్రోసెస్డ్ మీట్, డిజెర్ట్స్ తీసుకోవడం వల్ల కూడా శరీరంలో అధిక కొవ్వు వచ్చి చేరుతుంది.