KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2023-12-08T17:58:59+05:30 IST
KCR Photo in Hospital: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం రాత్రి బాత్రూమ్‌లో జారిపడటంతో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన్ను కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించగా తుంటి ఎముక విరిగిందని.. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం రాత్రి బాత్రూమ్‌లో జారిపడటంతో గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన్ను కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించగా తుంటి ఎముక విరిగిందని.. ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయన్ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ఆపరేషన్‌కు దాదాపు 2 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా కేసీఆర్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తరలించే ముందు ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం జగన్ ఫోన్‌లో పరామర్శించారు. కాలు తుంటి ఎముకకు ఫ్రాక్చర్ కావడంతో శస్త్ర చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరా తీశారు. ఈ మేరకు కేసీఆర్ తనయుడు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.