BJP : బండి సంజయ్, సోమువీర్రాజులకు కేంద్రంలో కీలక పదవులు
ABN , First Publish Date - 2023-07-08T23:17:06+05:30 IST
తెలుగు రాష్ట్రాల బీజేపీ మాజీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay), సీనియర్ నేత సోమువీర్రాజులను (Somu Veerraju) కీలక పదవులు వరించాయి..
తెలుగు రాష్ట్రాల బీజేపీ మాజీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay), సీనియర్ నేత సోమువీర్రాజులను (Somu Veerraju) కీలక పదవులు వరించాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఈ ఇద్దర్నీ తీసుకుంటున్నట్లు అగ్రనాయకత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వీరితో పాటు ఇంకో ఎనిమిది మందిని కూడా తీసుకుంటున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. శనివారం నాడు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ సుదీర్ఘ భేటీలో మొత్తం పది మందికి పదవులు కేటాయించడం జరిగింది.
ఆ పది మంది వీళ్లే..
ఏపీ నుంచి సోమువీర్రాజు
తెలంగాణ నుంచి బండి సంజయ్
హిమాచల్ ప్రదేశ్ నుంచి అధ్యక్షుడు సురేశ్ కశ్యప్
బిహార్ నుంచి సంజయ్ జైశ్వాల్
చత్తీస్‌గఢ్ నుంచి సీనియర్ నేత విష్ణుదేవ్ సాయి
పంజాబ్ నుంచి అశ్విని శర్మ
జార్ఖండ్ నుంచి దీపక్ ప్రకాష్
రాజస్థాన్ నుంచి సీనియర్ నేత కిరోడీ లాల్ మీనా
రాజస్థాన్ నుంచి సతీష్ పూనియాలకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. అయితే ఈ పదిమందిలో ఒకరిద్దరు తప్పితే దాదాపు అందరూ మాజీ అధ్యక్షులే ఉన్నారు.
కాగా.. అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ బండి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి శనివారం నాడు మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా సంజయ్ పదవికి సంబంధించి కీలక ప్రకటన ఉంటుందని బీజేపీ శ్రేణులు భావించాయి కానీ.. ఏమీ రాలేదు. రెండు మూడ్రోజులు కేంద్ర సహాయక మంత్రి పదవి కాదని.. డైరెక్టుగా ఒక శాఖనే బండికి అప్పగించాలని అభిమానులు, రాష్ట్ర కార్యకర్తలనుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం జాతీయ కార్యవర్గంలోకే తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో.. వారి ఆశల మీద నీళ్లు చల్లినట్లయ్యింది. ఈ పదవిపై బండి సంజయ్.. ఆయన వర్గం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.