Dhanush: సోషల్ ఇష్యూతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘సార్’

ABN , First Publish Date - 2023-02-08T19:25:46+05:30 IST

విభిన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’ (Asuran), ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షలకులను మెస్మరైజ్ చేశారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘వాతి’ (Vaathi)

Dhanush: సోషల్ ఇష్యూతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘సార్’

విభిన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’ (Asuran), ‘కర్ణన్’, ‘వడ చెన్నై’ వంటి చిత్రాలతో ప్రేక్షలకులను మెస్మరైజ్ చేశారు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘వాతి’ (Vaathi). తెలుగులో ‘సార్’ (Sir) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

విద్యా వ్యాపారంపై సినిమా రూపొందినట్టు ‘సార్’ (Sir Trailer) ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. ధనుష్ కాలేజీ మాస్టారిగా దర్శనమిచ్చారు. విద్యను వ్యాపారంగా మార్చిన వారిపై ఏ విధంగా పోరాటం చేశారు..? కాలేజీలోని సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు..? పేద వారికి విద్యను ఏ విధంగా చేరువ చేశారు..? అనే అంశాలను సినిమాలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి.. డబ్బులున్నవాడు దానిని కొంటాడు.. తక్కువ డబ్బులు ఉన్నవాడు అప్పు చేసయిన కడతాడు అనే డైలాగ్స్ అలరించాయి. అడిగింది ఇవ్వకపోతే పిల్లలు ఒక్క రోజే ఏడుస్తారు.. కానీ, వారి అమ్మనాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంత కాలం ఏడుస్తారు అనే డైలాగ్ మెస్మరైజ్ చేసింది. ‘సార్’ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఒకేసారి తెలుగు, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుంది. ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) బయాలజీ టీచర్ పాత్రను పోషించారు. సముద్ర ఖని, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘సార్’ ను యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించారు. జీవీ. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. ‌

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-02-08T19:27:42+05:30 IST