Viral News: మెట్రో రైల్లో కూర్చున్న ఈ బాలుడి ఫొటోను ఓ ఐఏఎస్ అధికారి ఎందుకు ట్వీట్ చేశారు..? అసలీ పిల్లాడి కథేంటంటే..
ABN , First Publish Date - 2023-04-08T15:02:18+05:30 IST
ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ బాలుడి ఫొటోను ఓ ఐఏఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పిల్లాడు..
ప్రస్తుతం దేశంలోని చాలా నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. నగరాల్లో రోజురోజుకూ జనాభా పెరుగుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయి. అయితే మెట్రో రైళ్ల రాకతో ఈ కష్టాలు చాలా వరకూ తగ్గాయనే చెప్పొచ్చు. ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో మెట్రో సౌకర్యం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చాలా సులభంగా చేరుకోగలుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ బాలుడి ఫొటోను ఓ ఐఏఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పిల్లాడు మెట్రో సేవలను ఎలా వినియోగించుకున్నాడంటే..
సోషల్ మీడియాలో మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఓ బాలుడి ఫొటో (Viral photos) తెగ వైరల్ అవుతోంది. పిల్లాడు మెట్రో రైల్లో కూర్చుని ఉండగా.. పక్కనే తన సైకిల్‌ని నిట్ట నిలువునా పార్క్ చేసి ఉంచాడు. ఇదేంటీ సైకిల్ మెట్రో రైల్లో ఉందనే డౌట్ మీకు రావొచ్చు. ముంబైకి (Mumbai) చెందిన ఈ బాలుడు రోజూ ట్యూషన్‌కి వెళ్తుంటాడు. అయితే అంత దూరం సైకిల్లో వెళ్లడం కష్టం కాబట్టి.. తెలివిగా మెట్రో రైలు (Metro train) ఎక్కాడు. రైల్లో సైకిల్‌ని పార్క్ చేసుకునే సౌకర్యం ఉందనే విషయాన్ని గుర్తించిన అతను.. ఆ సేవలను సద్వినియోగం చేసుకున్నాడు.
బాలుడు ఎంచక్కా సైకిల్‌తో పాటూ రైలు ఎక్కి ఇలా దాన్ని పక్కనే పార్క్ చేసుకున్నాడు. తన స్టేజీ రాగానే దిగి, యథావిధిగా సైకిల్‌పై వెళ్తుంటాడు. బాలుడి ఫొటోను రాజీవ్ అనే ఐఏఎస్ అధికారి (IAS officer Rajiv) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ముంబై మెట్రోలో రోజూ ప్రయాణించే ఈ బాలుడు.. మెట్రో రైల్లో ఇతను చాలా సౌకర్యవంతంగా కనిపించాడు.. సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు’’.. అని ప్రస్తావిస్తూ, బాలుడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మెట్రోలో ఈ సౌకర్యం మాకు చాలా బాగా నచ్చింది’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.