Vistara Airlines: విమానాన్ని శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది.. లోపలే కనిపించిన సీన్ చూసి షాక్.. చివరకు..!
ABN , First Publish Date - 2023-09-04T20:24:46+05:30 IST
అంధురాలైన తన తల్లి పట్ల విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రవర్తించిన తీరును ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాడు. విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై మండిపడ్డాడు. అసలేం జరిగిందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు విస్తారాపై ఆగ్రహం వెలిబుచ్చారు. దీంతో సదరు సంస్థ దిగి వచ్చింది.

అంధురాలైన తన తల్లి (Blind Mother) పట్ల విస్తారా ఎయిర్‌లైన్స్ (Vistara Airlines) సిబ్బంది ప్రవర్తించిన తీరును ఓ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాడు. విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై మండిపడ్డాడు. అసలేం జరిగిందో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు విస్తారాపై ఆగ్రహం వెలిబుచ్చారు. దీంతో సదరు సంస్థ దిగి వచ్చింది. ఆ వ్యక్తికి క్షమాపణలు (Vistara Apology) చెప్పి వివరాలు అడిగింది. జరిగిన ఘటనపై కచ్చితంగా విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
ఆయుష్ కేజ్రీవాల్ అనే వ్యక్తి తల్లి ఆగస్ట్ 31న ఢిల్లీ (Delhi) నుంచి కోల్‌కతాకు (Kolkata) విస్తారా విమానంలో ఒంటరిగా ప్రయాణించారు. అంధురాలైన తన తల్లికి విమానం సిబ్బంది సహకరించేలా టికెట్ బుకింగ్ సమయంలోనే ఆప్షన్ ఎంచుకున్నాడు. అయితే విమానం కోల్‌కతా చేరిన తర్వాత తన తల్లిని ఎవరూ పట్టించుకోలేదు. ప్రయాణికులు, సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత తన తల్లి ఒంటరిగా విమానంలో ఉండిపోయారని తెలిపాడు. చివరకు క్లీనింగ్ సిబ్బంది గమనించి సమాచారం ఇవ్వడంతో అప్పుడు తన తల్లిని విమానం నుంచి కిందకు దించారని తెలిపాడు.
Snake Video: బాబోయ్.. చూస్తోంటేనే గుండెదడ వచ్చేస్తోందిగా.. పెంపుడు పాములైతేనేం.. పిల్లలతో ఇంత రిస్కేంటంటూ..!
ఆయుష్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఎయిర్‌లైన్స్ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో దిగి వచ్చిన విస్తారా ఎయిర్‌లైన్స్ జరిగిన దానికి క్షమాపణలు చెప్పింది. టికెట్ బుకింగ్ వివరాలు ఇవ్వాలని అతడిని కోరింది. మొత్తం ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.