Mother Video: 16 రోజుల తర్వాత.. కొడుకు కోమాలోంచి బయటికొచ్చాడని ఆ తల్లికి తెలిసి.. పరుగులు తీస్తూ ఆస్పత్రికి వచ్చి..!

ABN , First Publish Date - 2023-06-27T10:54:17+05:30 IST

16రోజుల తరువాత తన బిడ్డ కోమాలోనుండి బయటకు వచ్చాడని తెలియగానే హాస్పిటల్ కు పరుగులు పెట్టిన ఆ తల్లిని చూస్తే..

Mother Video: 16 రోజుల తర్వాత.. కొడుకు కోమాలోంచి బయటికొచ్చాడని ఆ తల్లికి తెలిసి.. పరుగులు తీస్తూ ఆస్పత్రికి వచ్చి..!

తల్లిప్రేమ చాలా గొప్పది. కడుపులో నలుసు పడిన నాటి నుండి, ఆ తల్లి ప్రాణం పోయేవరకు పిల్లల మీద మమకారం అస్సలు వదులుకోలేదు. పిల్లలకు దగ్గు, జలుబు వస్తే బెంబేలెత్తిపోయి, పక్కన ఉండి కంటికి రెప్పలా చూసుకుంటారు. అలాంటిది పెద్ద సమస్యతో పిల్లలు కోమాలోకి వెళితే ఆ తల్లి బాధ వర్ణణాతీతం. ఓ తల్లి ఆ బాధను అనుభవించింది. 16రోజుల తరువాత తన బిడ్డ కోమాలోనుండి బయటకు వచ్చాడని తెలియగానే హాస్పిటల్ కు పరుగులు పెట్టింది. నెటిజన్ల హృదయాలను బరువెక్కించే ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

పిల్లలకు జబ్బు చేస్తే తల్లి(mother) ప్రాణమే ఎక్కువ విలవిల్లాడుతుంది. ఓ పిల్లాడికి పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ ఎపిడెర్మోలిసిస్ బులోసా(dystrophic epidermolysis bullosa) అనే అరుదైన చర్మ వ్యాధి ఉంది. ఈ వ్యాధిలో లోపలి చర్మం, బాహ్యచర్మాన్ని కలిపిఉంచే కొల్లాజెన్(collagen) ఉత్పత్తి కాదు. ఈ కారణంగా పిల్లాడి చర్మం మీద గాయాలు, బొబ్బలు, ర్యాషెస్ వంటివి చాలా వస్తుంటాయి. ఇంత సమస్య ఉన్న కొడుకును ఆ తల్లి పుట్టినప్పటి నుండి కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. కానీ ఆ పిల్లాడు తన జబ్బుకు బాధితుడయ్యాడు. శరీరమంతా బొబ్బలు, గాయాల కారణంగా ఆసుపత్రి పాలయ్యాడు. చిన్నప్రాణం కావడంతో కోమాలోకి వెళ్ళాడు(child gone into coma). పిల్లాడి దగ్గరే ఉంటూ కొడుకు కోమాలో నుండి ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురుచూసిన ఆ తల్లి ఏదో పని మీద ఇంటికి వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ లో పిల్లాడు కోమా నుండి బయటకు వచ్చాడని ఆమెకు సమాచారం అందింది. ఆమె హుటాహుటిన హాస్పిటల్ కు బయలుదేరింది. వీడియోలో ఓ తల్లి తన కొడుకు ఉన్న గదివైపు పరిగెడుతూ రావడం చూడొచ్చు. ఆమె గదిలోకి వెళ్ళగానే ఆ పిల్లాడు ఆమెను చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. అమ్మా అంటూ తల్లివైపు చూసి ఏడ్చేశాడు. ఏడుస్తూ తనను పిలుస్తున్న కొడుకును చూసి ఆ తల్లి కూడా భావోద్వేగానికి లోనయ్యింది. ఆ పిల్లాడి ముఖంలో భయం, బాధ ఆమెను మరింత కలచివేశాయి. పిల్లాడి దగ్గరకు వెళ్ళి హత్తుకుని ఆమె కూడా ఏడ్చేసింది. విదేశాల్లో జరిగినట్టు తెలుస్తున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఎలా వస్తాయయ్యా ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ చలానా తప్పించుకోవడానికి ఇంత రిస్క్ చేయాలా..?


ఈ వీడియోను goodnews_movement అనే ఇన్స్ట్రాగ్రామ్ అకౌంట్ నుండి షేర్ చేశారు. పిల్లాడి పరిస్థితిని వీడియో క్యాప్షన్ లో వివరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. 'ఆ పిల్లాడి ఏడుపు గుండెను పిండేస్తోంది' అని అంటున్నారు.'ఆ తల్లీకొడుకుల ఎమోషన్ చూసి కంటతడి పెట్టనివారు ఉండరేమో' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ పిల్లాడు తొందరగా కోలుకోవాలి, తల్లీకొడుకులు ఇద్దరూ సంతోషంగా ఉండాలి' అంటూ మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు.

Health tips: పిల్లలు పుట్టడం లేదని బెంగా? పడుకునేముందు పాలలో ఇదొక్కటి కలిపి తాగితే చాలు.. అద్బుతమైన ఫలితాలుంటాయి!


Updated Date - 2023-06-27T10:54:17+05:30 IST