Bus Journy: సూట్‌కేసులో 100 తులాల బంగారాన్ని పెట్టుకుని మరీ ఓ మహిళ బస్సు ప్రయాణం.. నిద్రమత్తు రావడంతో..!
ABN , First Publish Date - 2023-12-02T19:52:26+05:30 IST
ప్రయాణ సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మహిళలతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా...
ప్రయాణ సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దారుణంగా మోసపోయే ప్రమాదం ఉంటుంది. ఇక మహిళలతే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా, రాజస్థాన్‌లో ఓ మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ మహిళ సూట్‌కేసులో సుమారు 100 తులాల బంగారాన్ని పెట్టుకుని బస్సు ఎక్కింది. మధ్యలో నిద్రమత్తు రావడంతో కునుకుతీసింది. చివరకు ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని (Rajasthan) కోట జిల్లాలోని నయాపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఝలావర్ ప్రాంతానికి చెందిన కల్పనా సింగ్ అనే మహిళ (women) .. శుక్రవారం తన బంధువులు వివాహం (marriage) ఉండడంతో భిల్వారా జిల్లాలోని రాజ్‌గఢ్ ప్రాంతానికి వెళ్లింది. పెళ్లి కార్యక్రమం ముగించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో కోట బస్టాండ్ నుంచి మనోహర్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్లే బస్సు ఎక్కింది. తనతో పాటూ తెచ్చుకున్న సూట్‌కేస్‌ను లగేజీ ట్రాక్‌లో పెట్టింది. ప్రయాణం మధ్యలో నిద్ర రావడంతో ఆమె కునుకుతీసింది.
ఈ క్రమంలో ముందు కూర్చున్న వ్యక్తి.. కల్పనా సింగ్ సూట్‌కేస్‌ను తీసుకుని బస్సు దిగిపోయాడు. కాసేపటికి నిద్ర లేచిన ఆమె.. సూట్‌కేస్ లేకపోవడంతో షాక్ అయింది. విషయం తెలియజేయడంతో డ్రైవర్ బస్సు నిలిపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి.. సూట్‌కేస్ తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. సూట్‌కేస్‌లో సుమారు 100 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని బాధితురాలు తెలిపింది. అలాగే రూ.40 నుంచి 60 వేలు విలువ చేసే వెండి ఆభరణాలు కూడా ఉన్నాయని చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Viral: పిల్లలతో కలిసి చలిమంట వేసుకున్న తల్లి.. సడన్‌గా ఎంటరైన పులి.. చివరకు ఏం జరిగిందంటే..