SS Rajamouli: బీజేపీ ఎజెండాకు మద్దతుపై క్లారిటీ
ABN , First Publish Date - 2023-02-17T17:31:16+05:30 IST
దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). స్వాత్రంత్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.
దర్శక ధీరుడు యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR). స్వాత్రంత్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోలుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయినప్పటికీ, ఈ సినిమాపై కొన్ని విమర్శలు వచ్చాయి. బీజేపీ ఎజెండాకు జక్కన్న మద్దతు తెలిపారని కొంత మంది ఆరోపించారు. ఈ ఆరోపణలపై రాజమౌళి స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేషన్ దక్కించుకుంది. ఆస్కార్ పురస్కారాలు దగ్గర పడటంతో రాజమౌళి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ ఎజెండాకు మద్దతు పలుకుతున్నారనే ఆరోపణలపై కామెంట్స్ చేశారు.
‘‘..‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు ఫిక్షనల్ స్టోరీలు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా చరిత్ర, పాత్రలను వక్రీకరించే ఉద్దేశం నాకు లేదు. ‘ఆర్ఆర్ఆర్’ అనేది డాక్యుమెంటరీ. అది చరిత్ర పాఠం కాదు. ‘ఆర్ఆర్ఆర్’ లో పాత్రలను ఫిక్షనల్ చేశాం. కొన్ని సినిమాలను ఈ విధంగా గతంలోనే తీశారు. ‘ఆర్ఆర్ఆర్’ అనేది చరిత్రను వక్రీకరిస్తే.. ‘మాయ బజార్’ చారిత్రక ఇతిహాసానికి వక్రీకరణ. మొదట మేం కొమరం భీమ్ పోస్టర్‌ను ముస్లిం టోపీతో రిలీజ్ చేశాం. ఆ సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ ను ప్రదర్శిస్తే థియేటర్స్‌ను కాల్చేస్తామని ఓ బీజేపీ నాయకుడు చెప్పారు. ఆ టోపీని తీయకపోతే రోడ్డుపై కొడతానని నన్ను హెచ్చరించారు. అందువల్ల నేను బీజేపీకి చెందిన వ్యక్తినో, కాదో ప్రజలే నిర్ణయించాలి. అతివాదం అంటే నాకు అసహ్యం. బీజేపీ, ముస్లిం లీగ్ అయిన, సమాజంలోని అతివాదులు అయిన నాకు ఇష్టం ఉండదు’’ అని జక్కన్న తెలిపారు.