Share News

Breaking News: స్పెషల్ ఫ్లైట్‌లో సింగపూర్‌కి పవన్..

ABN , First Publish Date - Apr 08 , 2025 | 09:37 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: స్పెషల్ ఫ్లైట్‌లో సింగపూర్‌కి పవన్..
Breaking News

Live News & Update

  • 2025-04-08T13:00:12+05:30

    స్పెషల్ ఫ్లైట్‌లో సింగపూర్‌కి పవన్..

    • అల్లూరి జిల్లాలో పర్యటన ముగించుకొని విశాఖ ఎయిర్‌పోర్టుకు పవన్‌.

    • మొదటి రోజు పెదపాడు, రెండోరోజు కురుడీ గ్రామస్థులకు ఇచ్చిన మాటపై శివాలయానికి వెళ్లి పూజలు నిర్వహించిన పవన్‌కల్యాణ్‌.

    • గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకునేందుకు రచ్చబండ.

    • సుంకరమెట్టలో ఉడెన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం ముగించుకొని పయనం.

    • కుమారుడికి ప్రమాదం జరగడంతో ప్రత్యేక విమానంలో పవన్‌ పయనం.

  • 2025-04-08T13:00:11+05:30

    దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో తీర్పుపై రాజాసింగ్ రియాక్షన్‌

    • దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుపై స్పందించిన ఎమ్మెల్యే రాజాసింగ్.

    • దిల్‌సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో 12 ఏళ్ల తరువాత తీర్పు రావడం సంతోషం.

    • ఎన్ఐఎ, పోలీసులకు ధన్యవాదాలు.

    • ఆ బాంబ్ బ్లాస్ట్ కేసులో చనిపోయిన వారంతా పేద ప్రజలు.

    • ఒక మతానికి చెందిన వారంతా ఈ బ్లాస్ట్‌లకు పాల్పడ్డారు.

    • చనిపోయిన వారిలో అన్ని మతాల వారు ఉన్నారు.

    • జిహాద్ అంటే అమాయకులను చంపడమేనా.

    • యాసిన్ బత్కల్ ఇంకా దొరక లేదు.

    • ఉరిశిక్ష కాకుండా ప్రజా కోర్ట్‌లో ఎన్ కౌంటర్ చేయాలని ఎన్ఐఏ వారిని కోరుతున్నాను.

    • ఈ మేరకు వారు అనుమతి తీసుకోవాలి.

  • 2025-04-08T12:58:32+05:30

    కేరళ తరహాలో అరకు అభివృద్ది..: పవన్ కల్యాణ్

    • కేరళ తరహాలో అరకు ప్రాంతాన్ని హోంటూరిజం పేరిట అభివృద్ధి.

    • కురుడి గ్రామాన్ని మోడల్‌ పర్యటకంగా తీర్చిదిద్దుతాం.

    • గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తాం.

    • ఉపాధిహామీ పథకంలో భాగంగా ఉద్యానవన మొక్కలు అందిస్తాం.

  • 2025-04-08T12:57:36+05:30

    హంద్రీనీవా జాప్యానికి జగనే కారణం: మంత్రి నిమ్మల

    • కర్నూలు జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.

    • హంద్రీనీవా ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు.

    • పత్తికొండ నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రధాన కాల్వ పనులు పరిశీలన.

    • హంద్రీనీవా ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు.

    • బడ్జెట్‌లో అత్యధికంగా హంద్రీనీవాకు రూ.3,243 కోట్లు కేటాయించారు.

    • హంద్రీనీవా పాపానికి, జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్‌ కారణం.

  • 2025-04-08T12:56:22+05:30

    పవన్‌ కుమారుడికి ప్రమాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు

    • సింగపూర్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదంలో పవన్‌ కుమారుడికి.. గాయాలు కావడం బాధాకరం.

    • మార్క్‌ శంకర్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా.

  • 2025-04-08T12:55:40+05:30

    ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఎన్ఐఏ స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రెడ్డి

    • దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసులో తీర్పును స్వాగతిస్తున్నాం.

    • ఐదుగురు నిందితులకు NIA కోర్ట్ ఉరిశిక్ష విధించింది.

    • ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

    • కోర్టులో 150 మంది సాక్షుల స్టేట్‌మెంట్లు ఇప్పించాం.

    • టెక్నికల్ ఏవిడెన్స్, సాక్షుల స్టేట్‌మెంట్లు కోర్టు ముందు ప్రవేశపెట్టాం.

    • ట్రయల్ కోర్ట్ తీర్పుపై నిందితుల వేసిన అప్పీల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

    • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి 90 రోజులు ఉంటుంది.

    • 90 రోజుల్లో అప్పీల్‌కు వెళ్ళకపోతే డెత్ సెంటెన్స్‌ను అమలు చేసే అవకాశం.

    • ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు.

    • NIA సమర్థవంతంగా విచారణ చేసి ఆధారాలు కోర్టు ముందు పెట్టాం.

    • నిందితులు దిల్‌సుఖ్‌నగర్‌ కంటే ముందే హయత్‌నగర్‌లో ట్రయల్‌ బ్లాస్ట్‌ చేశారు.

    • మా వాదనలతో ఏకీభవించి ఐదుగురు నిందితుల అప్పీల్ పిటిషన్‌ డిస్మిస్‌ చేసింది.

  • 2025-04-08T12:54:15+05:30

    ఎమ్మెల్యే పల్లా, మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి సవాల్

    • రెండు వేల ఎకరాల భూకబ్జా చేసినట్లు నాపై ఆరోపణలు చేస్తున్నారు.

    • భూకబ్జాల ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.

    • మీ ఇళ్లలో గులాంగిరికి సిద్ధం.. లేదంటే మా ఇంట్లో పనిచేస్తారా?

    • ప్రభుత్వ భూములను కాపాడే వ్యక్తిని నేను.

    • రైతుల భూములు కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది.

    • దేవునూరు గుట్టలను రక్షించాలని మంత్రి పొంగులేటిని కోరా.

  • 2025-04-08T12:53:02+05:30

    హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం

    • దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు

    • హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయం

    • సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్న నిందితుల తరఫు న్యాయవాదులు

    • నెలరోజుల్లో సుప్రీంలో సవాల్ చేస్తామన్న నిందితుల తరఫు న్యాయవాదులు

    • ఇప్పటికే ట్రయల్ కోర్ట్ విధించిన ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు

    • NIA కోర్ట్ విధించిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయగా..

    • నిందితుల పిటిషన్ డిస్మిస్ చేసిన న్యాయస్థానం.

  • 2025-04-08T11:36:59+05:30

    వంశీకి మరో షాక్..

    • విజయవాడ: వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరో షాక్ ఇచ్చింది కోర్టు.

    • రిమాండ్ పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు.

    • సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

    • సత్య వర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

  • 2025-04-08T11:34:13+05:30

    డిప్యూటీసీఎం పవన్ తనయుడికి ప్రమాదం.. స్పందించిన మంత్రి లోకేష్..

  • 2025-04-08T11:32:59+05:30

    డిప్యూటీసీఎం పవన్ తనయుడికి ప్రమాదం.. స్పందించిన కేటీఆర్..

  • 2025-04-08T11:16:26+05:30

    ఢిల్లీ: తమిళనాడు గవర్నర్‌కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.

    • గవర్నర్ల అధికారాలపై స్పష్టత ఇచ్చిన సుప్రీంకోర్టు.

    • అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరు.

    • గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత, రెండవసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్‌కు లేదు.

    • తమిళనాడు ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు.

    • రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు.

    • గవర్నర్ ఆర్‌.ఎన్. రవి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

    • దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం.. మంగళవారం తీర్పునిచ్చింది.

    • రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకం సంబంధిత బిల్లులను కూడా గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదించలేదు.

  • 2025-04-08T11:13:14+05:30

    ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు శ్రవణ్ రావు

    • ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు

    • గతంలో రెండుసార్లు విచారణకు హాజరైన శ్రవణ్‌రావు.

    • గత విచారణలో సరైన సమాధానాలు చెప్పనందున..

    • శ్రవణ్‌రావును మరోసారి విచారణకు పిలిచిన అధికారులు

    • శ్రవణ్‌రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

    • ఎన్నికల సమయంలో వాడిన 2 సెల్‌ఫోన్లు ఇవ్వాలని..

    • శ్రవణ్‌రావును కోరిన సిట్ అధికారుల బృందం

    • ఫోన్స్ ట్యాపింగ్ చేశాక డేటా ఎవరికి పంపించారు? అని ఆరా

    • ఫోన్ ట్యాపింగ్‌కి కావాల్సిన వస్తువులు ఎవరు ఇచ్చారు? అని ఆరా

    • శ్రవణ్‌రావు కోసం 70కి పైగా ప్రశ్నలు సిద్ధం చేసిన సిట్ బృందం.

  • 2025-04-08T10:38:38+05:30

    తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

    • దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఉరిశిక్ష.

    • ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసిన హైకోర్టు.

    • ఉరిశిక్ష ఖరారు చేసిన జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధ ధర్మాసనం.

    • నిందితులను దోషిగా తేల్చిగా హైకోర్టు.. వారు వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.

    • సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.

    • NIA కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు.

    • 2016 డిసెంబర్‌లో ఉరిశిక్ష ఖరారు చేసిన NIA కోర్టు.

    • దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో A2 అసదుల్లా అక్తర్(యూపీ), A3 జియాఉర్‌ రహమాన్‌(పాకిస్థాన్), A4 మహమ్మద్ తహసీన్ అక్తర్ హాసన్(బిహార్), A5 మహమ్మద్ యాసిన్ భత్కల్ , A6 అజాజ్ షేక్ సమర్ అర్మాన్(మహారాష్ట్ర ).

    • 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు.

    • పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు.

    • 2016లో యాసిన్ భత్కల్‌ సహా.. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన NIA కోర్టు.

    • కింది కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన నిందితులు.

    • ఇప్పటికీ పరారీలో పేలుళ్ల కీలక దోషి రియాజ్‌ భత్కల్‌.

  • 2025-04-08T09:37:54+05:30

    డిప్యూటీ సీఎం పవన్ కుమారుడికి ప్రమాదం..

    • సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కుమారుడికి గాయాలు.

    • స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్న పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌.

    • చేతులు, కాళ్ళకు గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స.

    • ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో ఇబ్బందులు.

    • మన్యం పర్యటన తర్వాత సింగపూర్‌కు వెళ్లనున్న పవన్‌.