Share News

Train Accident: రెండు భాగాలుగా విడిపోయిన రైలు...సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి

ABN , Publish Date - Apr 08 , 2025 | 09:09 AM

Falaknama Express: ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ రైలు​ ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 15బోగీలు విడిపోయాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.

 Train Accident: రెండు భాగాలుగా విడిపోయిన రైలు...సీన్ కట్ చేస్తే ఇదీ పరిస్థితి
Falaknama Express Train Accident

శ్రీకాకుళం: ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు మంగళవారం నాడు భారీ ప్రమాదం తప్పింది. ట్రైన్ నుంచి బోగీలు విడిపోయి వెళ్లిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ నుంచి హౌరాకు ఈ రైలు వెళ్తుంది. మందస-సున్నాదేవి మధ్యలో ఫలక్‌నామా నుంచి బోగీలు విడిపోయాయి. ఈ విషయం తెలియడంతో వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.


8వ భోగీ వద్ద ప్రమాదం జరగ్గా.. 15 భోగీలు ఇంజనుతో సహా వెల్లిపోయాయి. ఘటన స్థలానికి రైల్వే సిబ్బంది చేరుకుంది. విడిపోయిన భోగీలను ట్రైన్‌కు సిబ్బంది అమరుస్తున్నారు. ప్రయాణానికి అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు విచారణ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యాంధ్రే లక్ష్యం

హెచ్‌సీయూ విద్యార్థులపై కేసుల ఎత్తివేత

For More AP News and Telugu News

Updated Date - Apr 08 , 2025 | 10:54 AM